ETV Bharat / state

పేదల ఆకలి తీర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం: తలసాని

పేదలను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వరద బాధితులకు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సాయాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదని హితవు పలికారు.

author img

By

Published : Nov 7, 2020, 3:52 PM IST

minister talasani srinivas yadav distribute flood refund in hyderabad
పేదల ఆకలి తీర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం: తలసాని

పేదల ఆకలి తీర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అన్నారు. వరదల్లో నష్టపోయిన అన్ని కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. సనత్ నగర్ డివిజన్​లోని అల్లావుద్దీన్ కోటి, అమీర్‌పేటలోని పిండి గిర్ని బస్తీలో బాధిత కుటుంబాలకు రూ.పదివేల ఆర్థిక సాయాన్ని మంత్రి అందజేశారు.

ప్రతిపక్ష నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఈ సాయాన్ని రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. వారి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. పేదలను ఆదుకోవడానికి ప్రతిపక్షాలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లక్ష్మీ బాల్‌రెడ్డి, అమీర్‌పేట కార్పొరేటర్ శేషు కుమారి, స్థానిక తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.