ETV Bharat / state

ప్రతిభకు వయసుతో పని లేదు: తలసాని

author img

By

Published : Mar 2, 2021, 3:08 PM IST

ఫిబ్రవరిలో మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్​లో నిర్వహించిన అథ్లెటిక్ పోటీల్లో సత్తా చాటిన ఆర్పీ భగవాన్​ను మంత్రి తలసాని అభినందించారు. ప్రతిభకు వయసుతో పని లేదని ఆయన అన్నారు. పట్టదలతో శ్రమిస్తే ఏదైనా సాధించవచ్చని అభిప్రాయపడ్డారు.

minister-talasani-srinivas-yadav-congratulated-athlet-rp-bhagwan-at-mla-quarters-in-hyderabad
ప్రతిభకు వయసుతో పని లేదు: తలసాని

ప్రతిభను చాటేందుకు వయసుతో పని లేదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అథ్లెటిక్ పోటీల్లో 80-85 ఏళ్ల విభాగంలో సత్తా చాటిన పద్మారావు నగర్​కు చెందిన ఆర్పీ భగవాన్​ను మంత్రి సన్మానించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్​లో కార్పొరేటర్ హేమలత, పద్మారావు నగర్ తెరాస ఇంఛార్జీ గుర్రం పవన్ కుమార్ గౌడ్​లతో కలిసి తలసానిని కలిశారు. పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదని భగవాన్ నిరూపించారని అన్నారు.

హ్యామర్ త్రోలో వెండి, డిస్కస్​ త్రోలో వెండి, జావలిన్ త్రోలో కాంస్య పథకాన్ని భగవాన్ సాధించారు. ఫిబ్రవరి 13, 14 తేదీల్లో మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్​లో నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో పలు పోటీలను నిర్వహించారు.

ఇదీ చదవండి: జోరుగా వ్యాక్సినేషన్- టీకా తీసుకున్న మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.