రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 16 నుంచి ప్రారంభిచనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో లాంఛనంగా నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు. ఈ ఏడాది 80 కోట్ల మీనాలను, 5 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేస్తామన్నారు. వేలాది మత్స్యకార కుటుంబాలు ఉపాధి పొందుతారని ఆయన అన్నారు. అన్ని జిల్లాల్లో అదేరోజు చేప పిల్లలు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి లేఖ రాశారు. ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, మత్స్యకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని లేఖల్లో పేర్కొన్నారు.
ఇదీ చూడండి :రామప్పను పరిశీలించిన కేంద్ర అధికారుల బృందం