పట్టభద్రుల ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఆరేళ్లలో గొంతు విప్పని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పట్టభద్రులను ఏమని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. హైదరాబాద్ ముషీరాబాద్‌లోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
రాజకీయంలో గెలుపు ఓటములు సర్వ సాధారణమని... నిరాశకు లోనుకాకుండా తెరాస అభ్యర్థి వాణీదేవి విజయానికి కృషి చేయాలని మంత్రి సూచించారు. అధికారంలో ఉంటే ప్రజాసమస్యలతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సాధించుకోవచ్చని తెలిపారు. కేవలం ప్రశ్నిస్తే సమస్య పరిష్కారం కాదని అధికారం ఉంటేనే సాధ్యమవుతుందని తలసాని పేర్కొన్నారు.