ETV Bharat / state

ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు: తలసాని - latest news on minister Talasani

వలస కార్మికులకు బియ్యం, నిత్యావసరాలు అందించిన ఘనత తెరాస ప్రభుత్వానిదే అని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​​ పేర్కొన్నారు. అఖిల పక్షం పేరుతో కొందరు నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

minister Talasani fires are all parties
ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు: తలసాని
author img

By

Published : May 1, 2020, 2:05 PM IST

అఖిలపక్షం పేరుతో కొందరు నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. ఎవరికి ఏం చేయాలో ముఖ్యమంత్రి కేసీఆర్​కు బాగా తెలుసని వ్యాఖ్యానించారు.

వలస కార్మికులకు బియ్యం, నిత్యావసరాలు అందించిన ఘనత మా ప్రభుత్వానిదే అని మంత్రి పేర్కొన్నారు. వలస కార్మికులను బస్సుల్లో వెళ్లాలంటే ఎన్నో రోజులు పడుతుంది.. వారిని రైళ్లలో తరలించాలని కోరినట్లు మంత్రి వెల్లడించారు. మా సలహాలు, సూచనలను పాటించి రైళ్లను ఏర్పాటు చేశారని తెలిపారు.

రాష్ట్రంలో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన 1000 మంది వలస కార్మికులకు భోజనాలు, వసతి ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఇందుకు ఏపీ మంత్రి మోపిదేవి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారన్నారు.

నగరంలోని మటన్ దుకాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మాంసం ధరలు నియంత్రణలోనే ఉన్నాయని తెలిపారు. మటన్‌ ఎక్కువ ధరకు అమ్మేవారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: స్వస్థలాలకు చేరుకోనున్న 4500 మంది వలస కార్మికులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.