ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ఉస్మానియా ఆసుపత్రి పరిణామాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. పేదల కోసం 27 ఎకరాల్లో ఉస్మానియాను పునర్నిర్మిస్తామంటే ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లాయన్నారు. తెలంగాణలో ఉన్నలా ప్రతిపక్షాలు దేశంలో మరెక్కడాలేవని దుయ్యబట్టారు. ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన మంత్రి సూపరింటెండెంట్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సచివాలయంలో గుప్త నిధులు ఉన్నాయని వాటి కోసం కూల్చివేస్తున్నారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భాజపా నాయకులు దిల్లీలో ఒక డ్రామా.. హైదరాబాద్‌లో మరో డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. భాద్యతాయుతమైన పదవిలో ఉన్న బండి సంజయ్ గల్లీ కౌన్సిలర్‌లా మాట్లాడుతున్నారని విమర్శించారు. చారిత్రాత్మకమైన ఉస్మానియా ఆసుపత్రిని కాపాడుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఆధీనంలోనే ప్రైవేట్ ఆసుపత్రులు ఉంటాయని.. అధికంగా డబ్బులు వసూల్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని అన్నారు.
ఇదీ చూడండి : ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు: భట్టి విక్రమార్క