హైదరాబాద్ రవీంద్రభారతిలో విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం మహాసభ నిర్వహించారు. ఈ మహాసభలో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి తల్లోజుతోపాటు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అర్.కృష్ణయ్య, అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూధనా చారి పాల్గొన్నారు. కర్రకోత యంత్రాలకు అనుమతి పత్రాలు అవసరం లేదంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను రాష్ట్రంలోనూ అమలయ్యేలా చూడాలని మంత్రులకు విశ్వబ్రాహ్మణ ప్రతినిధులు తెలిపారు. స్పందించిన శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: 'చనిపోయిందనుకునే పాతి పెట్టాలనుకున్నాం'