క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎమ్ఎల్ఆర్ఐటీ దిండిగల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ స్టేట్ మాస్టర్ అథ్లెటిక్ పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిటీ ఛైర్మన్ లక్ష్మణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అంజి రెడ్డి పాల్గొన్నారు.
ఈ నెల 13నుంచి ప్రారంభం కానున్న పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల నుంచి 750 మంది క్రీడాకారులు వివిధ క్రీడాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. 35 ఏళ్ల నుంచి వందేళ్ల లోపువారు ఈ పోటీల్లో పాల్గొంటారు. క్రీడల్లో గెలిచిన వారికి బహుమతితో పాటు ప్రతిభ కనబరిచిన వారిని రాయదుర్గంలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. ఈనెల 13 ఈ పోటీలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభిస్తారని... 14న జరిగే ముగింపు కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి: ఘట్కేసర్ అత్యాచారం కేసులో నలుగురు అరెస్టు