బతుకమ్మ ముగింపు సంబురాలు వైభవంగా నిర్వహించాలని అధికారులను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ఈ రోజు ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకలకు సంబంధించిన వేదిక, బతుకమ్మ ఘాట్లను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఎల్బీ స్టేడియంలో సాయంత్రం వేలాదిమంది మహిళలతో బతుకమ్మలను తయారుచేయించి, ఊరేగింపుగా బషీర్ బాగ్, లిబర్టీ క్రాస్ రోడ్డు మీదుగా.. బతుకమ్మ ఘాట్ వరకు తీసుకెళ్లనున్నారు.
సాంస్కృతిక శాఖ కళాకారులు, మహిళలలు వేలాదిగా తరలివచ్చి.. బతుకమ్మ ఘాట్‌లో బతుకమ్మల నిమజ్జనంలో పాల్గొంటారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. అనంతరం... హుస్సేన్ సాగర్‌లో భారీగా బాణసంచాను పేల్చి.... సంబురాలను విజయోత్సవంతో ముగించాలని అధికారులను ఆదేశించారు. రవీంద్రభారతిలో శనివారం ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు.
ఇవీ చూడండి: త్రిసభ్య కమిటీతో చర్చలు విఫలం... 5 నుంచి సమ్మె