డా. బీఆర్.అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో బడుగుబలహీన వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. తన నివాసంలో అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
అణగారిన వర్గాలకు ఆద్యుడైన రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త అంబేడ్కర్... దేశానికే కాకుండా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని శ్రీనివాస్‌గౌడ్ కొనియాడారు. వారి ఆశయాలు అందరికీ స్ఫూర్తి దాయకమని వ్యాఖ్యానించారు.