రాష్ట్రంలో యునెస్కో గుర్తింపు పొందాల్సిన అతిపురాతనమైన కళలు ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కాల్సిన అనేక ప్రాంతాలు మనరాష్ట్రంలో ఉన్నట్లు ఆయన వివరించారు. చారిత్రక రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు ప్రక్రియ తుది దశలో ఉందని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన 39వ వరల్డ్ హెరిటేజ్ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఈమని శివనాగిరెడ్డి, స్థపతి రచించిన అసఫ్‌జాహీల వారసత్వ కట్టడాలు అనే గ్రంథాన్ని మంత్రి ఆవిష్కరించారు. రాష్ట్రంలో కట్టడాలే కాకుండా మనిషికి నాగరితక నేర్పిన అతి పురాతనమైన కళలు, సంప్రదాయాలు యునెస్కో గుర్తింపు పొందేందుకు అవకాశాలున్నాయని ఆయన వివరించారు. ప్రాచీనమైన పేరిణీ నృత్యాన్ని యునెస్కో దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ఇదీ చూడండి: క్షీణించిన మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్యం