గ్రేటర్ ఎన్నికల సందర్భంగా తెరాస ప్రవేశపెట్టిన మేనిఫెస్టోకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హర్షం వక్తం చేశారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ డివిజన్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, సాయన్న, స్థానిక అభ్యర్థి లాస్య నందిత కలిసి ప్రారంభించారు.
తెరాస హయంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని మంత్రి చెప్పుకొచ్చారు. నగర ప్రజలకు ప్రభుత్వం భరోసా కల్పించిందని మంత్రి అన్నారు.
ఇదీ చదవండి: 'పారిశ్రామిక వేత్తలకు చేయూతనిచ్చే ప్రభుత్వానికే మా మద్దతు'