ETV Bharat / state

'తెలంగాణను అభివృద్ధి చేసినందుకు చార్జిషీట్​ వేస్తారా?' - గ్రేటర్​ ఎన్నికలు

భాజపా ఛార్జిషీటుపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పందించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటున్నందుకు కేంద్ర ప్రభుత్వంపైనే చార్జిషీటు వేయాలని ఆయన ఆరోపించారు. తెలంగాణను అభివృద్ధి చేసినందుకు తెరాసపై చార్జిషీటు వేస్తారా అంటూ మండిపడ్డారు.

minister srinivas goud comments on bjp
'తెలంగాణను అభివృద్ధి చేసినందుకు ఛార్జిషీట్​ వేస్తారా?'
author img

By

Published : Nov 22, 2020, 4:59 PM IST

తెరాసపై భాజపా విడుదల చేసిన చార్జిషీటును మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిప్పికొట్టారు. కేంద్రానికి అన్నిరకాలుగా సాయం చేస్తున్నా.... రాష్ట్రానికి మాత్రం చేసిందేమీలేదని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పినందుకు భాజపాపైన చార్జిషీటు దాఖలు చేయాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు తెరాసపై చార్జిషీటు వేస్తారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంపై చార్జిషీట్ ఎందుకు వేస్తారో అర్థం కావడం లేదని కేంద్ర మంత్రులపై శ్రీనివాస్​గౌడ్ ధ్వజమెత్తారు.

సరిహద్దుల్లో కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్లే తెలంగాణ సైనికుడు సంతోష్ మరణించారని మంత్రి ఆరోపించారు. జీహెచ్ఎంసీలో భాజపా గెలిస్తే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు హైదరాబాద్​ను అమ్మేస్తారన్నారు. స్వామిగౌడ్ భాజపాలోకి వెళ్లరని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మామూలు స్థాయిలో ఉన్న తనను సీఎం కన్నా ఎక్కువ ప్రోటోకాల్ స్థానంలో కూర్చోబెట్టారని స్వామిగౌడే అన్నారని పేర్కొన్నారు. భాజపా గాలాలు వేసినా చేపలు పడవని మంత్రి వ్యాఖ్యానించారు.

'తెలంగాణను అభివృద్ధి చేసినందుకు ఛార్జిషీట్​ వేస్తారా?'

ఇవీ చూడండి: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.