ETV Bharat / state

పర్యాటక శాఖ అవార్డులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం - Telangana State Tourism Awards latest news

minister-srinivas-goud-announcing-tourism-awards
పర్యాటక శాఖ అవార్డులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
author img

By

Published : Sep 27, 2020, 8:16 PM IST

Updated : Sep 27, 2020, 10:08 PM IST

20:14 September 27

పర్యాటక శాఖ అవార్డులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

పర్యాటక శాఖ అవార్డులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

గత సంవత్సరం పర్యాటక శాఖ అభివృద్ధిలో భాగస్వామ్యమైన సంస్థలు, ట్రావెల్స్ ను ఎంపిక చేసి అవార్డులు అందజేశామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మొత్తం 8 విభాగాల్లో ఈ అవార్డులను అందజేసినట్లు ఆయన వెల్లడించారు. రవీంధ్రభారతీలో జరిగిన సమావేశంలో అవార్డుల వివారలను మంత్రి తెలియజేశారు.

యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్-2020లో భాగంగా గ్రామీణ పర్యాటక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అవార్డులు అందజేశామన్నారు. పర్యాటక శాఖ కార్యదర్శి, డైరెక్టర్​తో ఓ కమిటీని వేశామని.. అన్ని పరిశీలించి పర్యాటకశాఖలోని వివిధ విభాగాల్లో ఈ అవార్డులను అందజేశామన్నారు. 

5 స్టార్ కేటగిరిలో ఫలక్ నామా ప్యాలెస్​కు, 4 స్టార్​లో కేటగిరిలో గోల్కోండ హోటల్, ఇతర విభాగంలో అలంకృత రిసార్ట్స్, 3 స్టార్ విభాగంలో రామోజీ ఫిల్మ్ సిటీలోని సితార హోటల్​కు అందజేశామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అంతకుముందు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి...ఆయన సేవలను కొనియాడారు. 

ఇదీ చూడండి : హేమంత్​ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి : ఐద్వా

Last Updated : Sep 27, 2020, 10:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.