శనగపప్పు మద్దతు ధరకు కొనుగోలు చేసే కోటా పరిమితి పెంచాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. రైతు శ్రేయస్సు, సాగుకు ప్రోత్సాహం అందించేందుకు వెంటనే నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నిరంజన్ రెడ్డి.. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు లేఖ రాశారు.
రాష్ట్రంలో 1.46 లక్షల హెక్టార్లలో శనగపప్పు సాగు చేశారని.. హెక్టారుకు 12.95 క్వింటాళ్ల చొప్పున 1.89 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. 47,600మెట్రిక్ టన్నుల కొనుగోలుకు మాత్రమే అనుమతించారని.. మరో 27 వేల 830 మెట్రిక్ టన్నులకు అనుమతివ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. కేంద్రం అనుమతించిన దానిలో ఏప్రిల్ 4 వరకు 12, 963 మంది రైతుల నుంచి 19, 876.10 మెట్రిక్ టన్నుల శనగపప్పును.. పక్రకటించిన మద్దతు ధర ప్రకారం క్వింటాలుకు రూ. 4, 875కు కొనుగోలు చేశామని మంత్రి వివరించారు.
ఇదీ చూడండి: మాస్కు ఎవరు వాడాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?