ఆదివాసీ ఉద్యమ నాయకులు, తుడుందెబ్బ వ్యవస్థాపకులు దబ్బకట్ల నర్సింగరావు మృతి పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆదివాసీల గొంతుక వినిపించి వారి హక్కులను కాపాడడంలో నర్సింగరావు చేసిన కృషి ఎప్పటికీ మరవలేదనిదన్నారు. నర్సింగరావు మృతి ఆదివాసీలకు తీరని లోటని పేర్కొన్న సత్యవతి రాఠోడ్... ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నర్సింగరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. రోజుల క్రితం అనారోగ్యంతో ములుగు జిల్లా రాయినగూడెంలోని తన నివాసంలో నర్సింగరావు కన్నుమూశారు. గతంలో ఆయన ములుగు మండల పరిషత్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే సమయంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి పేరుతో తుడుందెబ్బ సంస్థను ఏర్పాటు చేశారు. ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధి కోసం నర్సింగరావు పాటుపడ్డారు.