గిరిజన, దళిత సంక్షేమ అభివృద్ధికి ప్రణాళిక, బడ్జెట్ కంటే పెద్ద మనసు అవసరమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయకోణంలో ఆలోచించే వ్యక్తి అని....దేశంలోనే గిరిజన, దళితుల అభ్యున్నత కోసం అనేక కొత్త పథకాలకు రూపకల్పన చేస్తున్నారన్నారు.
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి పథకం కార్యక్రమం ద్వారా మసాబ్‌ట్యాంక్‌లోని డీఎస్‌ఎస్ భవన్‌లో 52 మంది గిరిజన యువకులకు వాహనలను అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక తండాకు చెందిన తనను మంత్రిని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా డ్రైవర్ కమ్ ఓనర్‌గా మారిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఎవరూ మద్యం సేవించి కార్లు నడపవద్దని వారిచే ప్రతిజ్ఞ చేయించారు.
ఇవీ చూడండి:పద్దులకు శాసనసభ ఆమోదం...