ETV Bharat / state

'మహిళాశిశు సంక్షేమ శాఖ పనుల్లో వేగం పెంచాలి'

హైదరాబాద్​లో మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ అధికారులతో సమావేశమయ్యారు. శాఖలోని కొనసాగిస్తున్న నిర్మాణ పనులను ఉపాధి హామీ పథకం కింద వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. కరోనా నేపథ్యంలో గ్రామాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా అంగన్ వాడీ కేంద్రాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని, ప్రజల్లో చైతన్యం కల్పించాలని మంత్రి సూచించారు.

minister satyavathi rathod reviw meeting on works
'మహిళాశిశు సంక్షేమ శాఖ పనుల్లో వేగం పెంచాలి'
author img

By

Published : Jun 18, 2020, 7:38 PM IST

మహిళాశిశు సంక్షేమ శాఖలో నిర్మాణ పనులను ఉపాధి హామీ పథకం కింద వేగంగా చేయాలని ఆ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్​లో అధికారులతో సమావేశమైన మంత్రి... పనులపై సమీక్షించారు. దాదాపు 12 వేల అంగన్ వాడీ కేంద్రాలు కిరాయి భవనాల్లో నడుస్తున్నాయని... ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఉపాధిహామీ పథకం కింద భవనాలు నిర్మించాలని సూచించారు. కిరాయి భవనాల్లో నడుస్తున్న అంగన్ వాడీ కేంద్రాలను దగ్గర్లో ఉన్న పాఠశాలల్లో నడపడంపై దృష్టి సారించాలన్నారు.

అంగన్ వాడీల పెండింగ్ పనులు, మహిళలు, శిశువుల కోసం నిర్మించే టాయిలెట్స్, శిశు విహార్, హోమ్స్​లలోని నిర్మాణ పనులు గుర్తించి ఉపాధి హామీ పథకం కింద నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ఆరోగ్య లక్ష్మీ పథకం కింద మహిళలు, చిన్నారులకు అందించే సరుకుల పంపిణీ సరైన సమయంలో అందించేలా పర్యవేక్షించాలని... గర్భిణీలకు ఆరోగ్య సంరక్షణ కార్డు ద్వారా ఇచ్చే మందులు సరిగ్గా అందేలా చూడాలన్నారు.

నవజాత శిశువులకు టీకాలు క్రమం తప్పకుండా వేసేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కరోనా నేపథ్యంలో గ్రామాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా అంగన్ వాడీ కేంద్రాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని, ప్రజల్లో చైతన్యం కల్పించాలని మంత్రి సూచించారు. మహిళలు, శిశువులకు కరోనా వైరస్ లక్షణాలున్నట్లు కనిపిస్తే వెంటనే సంబంధిత వైద్య అధికారులకు సమాచారం అందించి, వైరస్ వ్యాప్తి నివారణలో అంగన్ వాడీ సిబ్బంది ముందు వరుసలో ఉండి పనిచేయాలని సత్యవత్ రాథోడ్ సూచించారు.

ఇదీ చదవండి: కరోనాపై మీరు చేస్తున్నది సరిపోదు.. సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.