సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవం: మంత్రి సబితా - Hyderabad Latest News
వరద బాధితులకు అండగా ఉంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. నష్టపోయిన వాళ్లందరికీ 10వేల రూపాయల సాయం అందజేస్తామన్నారు. వరద సాయం ప్రకటించని కేంద్రం తీరుపై మంత్రి సబిత మండిపడ్డారు. మీర్పేట పెద్ద చెరువు కట్ట తెగలేదని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. మీర్పేట్ పెద్దచెరువు కట్టకు మరమ్మతులు చేశారని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్నవి మంత్రాలయం చెరువు వీడియో అని మంత్రి స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవం: మంత్రి సబితా