ETV Bharat / state

మంత్రి ఇంటికి పరిమితమై ఉండాలనే ఎస్​ఈసీ ఆదేశాలు రద్దు - తెలంగాణ వార్తలు

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎస్‌ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన హౌస్‌మోషన్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం మంత్రి మీడియాతో మాట్లాడకూడదన్న ఎన్నికల సంఘం ఆదేశాలను సమర్థించింది.

minister-pedhi-reddy-issue
మంత్రి ఇంటికి పరిమితమై ఉండాలనే ఎస్​ఈసీ ఆదేశాలు రద్దు
author img

By

Published : Feb 7, 2021, 1:41 PM IST

ఆంధ్రప్రదేశ్‌‌ పంచాయతీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి దాఖలు చేసిన హౌస్‌మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. మంత్రి పెద్దిరెడ్డి ఇంటికి పరిమితమై ఉండాలన్న ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను న్యాయస్థానం రద్దు చేసింది.

ఈనెల 21 వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇంటికే పరిమితం కావాలని ఎస్‌ఈసీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎస్‌ఈసీ ఆదేశాలు రాజ్యాంగ విరుద్దమంటూ.. హైకోర్టులో మంత్రి హౌస్​మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను రద్దు చేసింది. మీడియాతో మాట్లాడొద్దన్న నిబంధనను మాత్రం సమర్థించింది.

ఇదీ చదవండి: ఖమ్మంలో కాంగ్రెస్​ అగ్రనేతల పర్యటన.. పార్టీ పూర్వవైభవమే అజెండా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.