ఆర్టికల్ 370 రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అమీర్‌పేటలోని సెస్‌లో "భారత్‌పై ఆర్టికల్ 370 రద్దు ప్రభావం" అనే అంశంపై 'భారత్ 2025' సంస్థ నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతంలో ఆర్టికల్ 370 అమల్లో ఉన్నప్పుడు కశ్మీర్‌లో భయంకరమైన పరిస్థితులు ఉండేవని... అవినీతి, అక్రమాలు రాజ్యమేలాయని తెలిపారు. అభివృద్ధి కోసం కేంద్రం కేటాయించిన నిధులు కూడా పక్కదారి పట్టాయని చెప్పారు. ఇప్పుడు 370 రద్దు కావడంపై కశ్మీర్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. కశ్మీర్‌లో రాళ్లు పట్టుకునే యువత... కంప్యూటర్లు పట్టుకునేలా చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.
ఇదీ చూడండి : 'ప్రభుత్వ శాఖలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి'