ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యాల కోసం అందరం కలిసి వ్యవసాయం, రైతాంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో నిర్వహించిన ప్రముఖ సంఘసంస్కర్త సావిత్రీ బాయి పూలే జయంతి కార్యక్రమానికి హాజరయ్యారు.
తెలంగాణ అగ్రిడాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలండర్, డైరీని మంత్రి ఆవిష్కరించారు నాలుగేళ్లలో తెలంగాణ వ్యవసాయ రంగం స్వరూపం సంపూర్ణంగా మారిపోవాలని ఆకాంక్షించారు.
వ్యవసాయ శాఖ ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, అందరి అభిప్రాయాలు తెలుసుకుని నిర్ణయాలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అన్ని సంఘాలు ఒక తాటి మీదకు రావాలన్నదే తన ఉద్దేశమని... అందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
- ఇవీ చూడండి : రూట్ల ప్రైవేటీకరణకు కేంద్రం రైట్ రైట్?