వ్యవసాయ యాంత్రీకరణకు ఊబర్ తరహా విధానాన్ని తీసుకువస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి శాసనసభలో ప్రకటించారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీవ్రంగా ఉందన్నారు. కూలీల కొరతవల్ల ఛత్తీస్‌గఢ తదితర రాష్ట్రాల నుంచి పురుషులు వచ్చి నాట్లు వేస్తున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో వ్యవసాయ పనులకు ఏడాదికి 71 లక్షల పనిగంటలు అవసరం కాగా.. 16 లక్షల పనిగంటల వరకు కొరత ఉందన్నారు. భవిష్యత్‌లో కొరత అధికమయ్యే అవకాశం ఉన్నందున యాంత్రీకరణ అత్యవసరమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొంభైరెండున్నర శాతం భూమి చిన్న, సన్నకారు రైతుల వద్ద ఉందని.. అందుకు అనుగుణంగా యాంత్రీకరణ విధానాన్ని రూపొందిస్తున్నామని నిరంజన్‌రెడ్డి వివరించారు. మండలాల వారిగా వివరాలు సేకరించి ఊబరైజేషన్‌కు ప్రణాళికలు రూపొందిస్తున్నాన్నారు. బడ్జెట్‌లో ప్రత్యేకంగా యాంత్రీకరణకు 15 వందల కోట్లు కేటాయించామన్నారు. ప్రస్తుతం 45 శాతం వరకు ఉన్న యాంత్రీకరణను 95 శాతానికి తీసుకెళ్లాలనేదే ప్రభుత్వ లక్ష్యమని నిరంజన్‌రెడ్డి సభకు వెల్లడించారు.
ఇదీ చదవండి:దేశంలో కొత్తగా 47 వేల మందికి వైరస్