భవిష్యత్‌లో పత్తి సాగును కోటి ఎకరాలకు చేర్చేలా ప్రోత్సహిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. రైతుల నుంచి పత్తి సేకరణకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఈసారి 376 జిన్నింగ్ మిల్లులు నోటిఫై చేసేందుకు కలెక్టర్లకు ఆదేశాలిచ్చామని తెలిపారు. మరో 20 నుంచి 25 మిల్లులు కొత్తగా ప్రారంభం కాబోతున్నాయన్నారు.
ఈసారి అంతర్జాతీయంగా పత్తికి మంచి డిమాండ్ ఉంది. పత్తి సేకరణ ధరను సీసీఐ రూ. 6,025గా నిర్ణయించింది. సీసీఐ నిర్ణయించిన దానికంటే అధికంగా ధర వస్తోంది. ఇవాళ వరంగల్ మార్కెట్‌లో రూ.7,235 ధర పలికింది. క్వింటాకు 1,235 రూపాయలు అధికంగా వస్తోంది. వీలైతే కోటి ఎకరాల వరకు పత్తి సాగును విస్తరిస్తాం.
-నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
పత్తి ఉత్పత్తిలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉన్నా.. సీసీఐ సేకరణలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని మంత్రి నిరంజన్‌రెడ్డి వివరించారు. 2019-20లో 21 లక్షల 62 వేల మెట్రిక్ టన్నుల సేకరణ జరిగిందని... 2020-21లో గతేడాదికిగాను 17 లక్షల 89 వేల మెట్రిక్ టన్నుల పత్తిని సీసీఐ సేకరించిందని తెలిపారు. ఈసారి ఉత్పత్తి లక్ష్యం 33లక్షల30 వేల మెట్రిక్ టన్నులుగా అంచనా వేశామన్నారు. దేశంలో పత్తినిల్వలు ఖాళీ అయ్యాయని.. అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉందన్నారు. 20 లక్షల మంది రైతులు పత్తిని సాగుచేస్తున్నారని మరింత మందిని ప్రోత్సహిస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి శాసనసభలో తెలిపారు.
ఇదీ చూడండి: KTR at TS Council: 'ఎలక్ట్రిక్ వాహన రంగంలో రాష్ట్రానికి రూ.5, 600 కోట్లు వచ్చాయి'