ETV Bharat / state

TRS Maha Dharna: 'కిషన్‌రెడ్డికి ఎద్దులు లేవు... బండి సంజయ్‌కి బండి లేదు'

మంత్రి నిరంజన్​రెడ్డి(Minister Niranjan reddy latest news) కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద ధర్నాచౌక్‌లో (trs maha dharna at Indira park ) తెరాస చేపట్టిన మహాధర్నాలో పాల్గొన్న మంత్రి... రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసమే ఈ మహాధర్నా అని పేర్కొన్నారు. కేంద్రం విధానాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు.

TRS Maha Dharna
మంత్రి నిరంజన్‌రెడ్డి
author img

By

Published : Nov 18, 2021, 12:34 PM IST

రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసమే ఈ మహాధర్నా

రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం మహాధర్నా చేపట్టామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి (Minister Niranjan reddy latest news) పేర్కొన్నారు. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద ధర్నాచౌక్‌లో చేపట్టిన మహాధర్నాలో (trs maha dharna at Indira park ) పాల్గొన్న మంత్రి.... రాష్ట్ర రైతుల కోసం.. స్వయంగా సీఎం (cm kcr in maha dharna) ధర్నాలో కూర్చున్నారని వెల్లడించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతాలు సృష్టించిందని తెలిపారు. రాష్ట్రంలో పల్లెలన్నీ పచ్చబడ్డాయని చెప్పారు. కేంద్రం విధానాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. కేంద్ర అస్పష్ట విధానాలతో తెలంగాణ రైతులకు అపార నష్టం కల్గుతుందని వివరించారు.

'రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసమే ఈ మహాధర్నా చేపట్టాం. రైతుల కోసం స్వయంగా సీఎం కేసీఆర్​ ధర్నాలో కూర్చున్నారు. కేంద్రం విధానాలతో రైతులకు తీవ్ర నష్టం. కేంద్ర అస్పష్ట విధానాలతో తెలంగాణ రైతులకు అపార నష్టం వాటిల్లుతోంది. రాష్ట్ర ప్రభుత్వంపై నెపం వేసేలా రాష్ట్ర భాజపా నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అన్నీ వ్యవస్థలు కేంద్రం చేతుల్లోనే ఉన్నాయి. ఒప్పందం చేసుకున్న ధాన్యాన్ని కూడా కొనడంలేదు. సాగు గురించి భాజపా నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉంది.'

- నిరంజన్​ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి

అన్ని వ్యవస్థలూ కేంద్రం చేతుల్లోనే

రాష్ట్ర ప్రభుత్వంపై నెపం వేసేలా రాష్ట్ర భాజపా నేతలు మాట్లాడుతున్నారని నిరంజన్​ రెడ్డి విమర్శించారు. అన్ని వ్యవస్థలూ కేంద్రం చేతుల్లోనే ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒప్పందం చేసుకున్న ధాన్యాన్ని కూడా కొనడంలేదని ఆరోపణలు చేశారు. వానాకాలంలో 63 లక్షల ఎకరాల్లో పంటలు వేశారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అద్భుత ప్రాజెక్టులు కట్టారని... బీడు భూముల్లో కూడా పంటలు పండుతున్నాయని తెలిపారు.

భాజపా నేతల మాటలు విడ్డూరం

రైతుబంధు వంటి పథకాలతో రైతులకు ప్రోత్సాహం అందిస్తున్నామని వెల్లడించారు. సాగు గురించి భాజపా నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కిషన్‌రెడ్డికి ఎద్దులు లేవు... బండి సంజయ్‌కి బండి లేదని ఎద్దేవా చేశారు. కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దేశం కోసం, ధర్మకోసం తెలంగాణలో పండించిన మొత్తం పంటను కొంటామని చెప్పాలని సూచించారు.

పునఃసమీక్షించుకోకపోతే కేంద్రనికే నష్టం

వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉత్తరభారతంలో ఒక సీజనులోనే వరి పండుతోందని స్పష్టం చేశారు. తెలంగాణలో అన్నీ సీజన్లలో వరి పండుతోందన్న మంత్రి నిరంజన్​రెడ్డి... 138 కోట్ల మందికి తిండి పెట్టేది, ఉపాధి కల్పించేది వ్యవసాయమేనని తెలిపారు. కేంద్రం తన నిర్ణయాన్ని పునః‌సమీక్షించుకోవాలని సూచించారు. దేశ ప్రజల ఉపాధి, ఆహార అవసరాల కోసం వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. పునఃసమీక్షించుకోకపోతే కేంద్రమే నష్టపోతోందని హెచ్చరించారు. ఐక్యమత్యంగా ఉంటే అంతిమ విజయం రైతులదేనని వివరించారు. రైతుల కంట కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని వెల్లడించారు.

ఇదీ చూడండి: CM KCR at TRS MAHA DHARNA : 'తెరాస మహా ధర్నా : ఆరంభం మాత్రమే.. అంతం కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.