Union Minister Explain Farmer Suicides In Telangana: రైతుల మరణాలపై ఆత్మహత్యలంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారం అసత్యం అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. దేశంలో రైతు మరణాలపై పార్లమెంటులో సభ్యుల ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వివరణ నేపథ్యంలో మంత్రి ఈ విధంగా స్పందించారు. కొన్ని పత్రికలు పనికట్టుకుని విష ప్రచారం చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని తెలిపారు.
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి.. ప్రతి ఏటా తగ్గుతూ వస్తున్న రైతన్నల మరణాలని కేంద్రమంత్రి నరేంద్ర తోమర్ చెప్పారని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపే అందుకు కారణం అని కొనియాడారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో 2017లో 846గా నమోదైన రైతు మరణాల సంఖ్య.. 2021లో 352కి తగ్గాయని కేంద్రమంత్రి ప్రకటించారని తెలిపారు. దేశంలో రైతుల మరణాలపై రాజ్యసభలో సభ్యుడు నారాయణ్ దాస్ గుప్తా అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు.
రైతు బీమా పథకం కింద ఇప్పటి వరకు 90 వేల పైచిలుకు రైతుల కుటుంబాలను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్‌కే సొంతమని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడా ఈ తరహా రైతు బీమా పథకం లేదని తేల్చిచెప్పారు. పార్లమెంటులో కేంద్ర మంత్రి చెప్పిన సమాధానం చూసైనా తెలంగాణలో విపక్షాలు రైతుల మరణాలపై రాజకీయాలు చేయడం మానుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హితవు పలికారు.
వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కేటాయింపులు: 2022 సంవత్సరం నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అని మొన్నటి వరకు గొప్పగా చెప్పుకున్న ప్రధాని నరేంద్రమోదీ సర్కారు ఈ బడ్జెట్‌లో మాత్రం ఆ ఊసే లేదని విపక్షాలు విమర్శించాయి. గత ఏడాది కన్నా ఈ ఏడాది వ్యవసాయ రంగానికి 22 శాతం కేటాయింపులు తక్కువగా ఉన్నాయని ఆరోపించారు. గత బడ్జెట్‌లో రూ.2.25 లక్షల కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్‌లో అది రూ.1.75 లక్షల కోట్లకు కుదించారు. అయితే తాజాగా మెల్లగా రసాయన ఎరువులకు మంగళం పాడుతున్న కేంద్రం.. ఇప్పటికే ఎరువుల ధరలు, డీజిల్, పెట్రోల్ ధరల పెంపు ద్వారా రైతులపై పెట్టుబడి భారం పెంచుతుందని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు కోటి మంది రైతులను మూడేళ్లలో సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లిస్తామని బడ్జెట్లో ప్రతిపాదించినా.. వాటిని తగిన నిధులు కేటాయించలేదు.
ఇవీ చదవండి: