జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రజల కష్టాలు, తెలంగాణ వాణి వినిపించిన ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న అని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశంసించారు. శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన గోరటి వెంకన్నకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కష్టాలను "కరువు గోస" పేరుతో ప్రపంచానికి చాటారు... ప్రజలను చైతన్యం చేశారు... "పాలమూరు వెతల"పై ఆయన పాటలు అందరినీ కదిలించాయి... తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచాయని గుర్తు చేశారు.
వెంకన్నను గౌరవించి పెద్దల సభలో అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి నిరంజన్‌రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.
ఇదీ చూడండి; పెద్దల సభకు వెళ్తున్న ఈ ముగ్గురి నేపథ్యం తెలుసా...?