రాష్ట్రంలో ఈ యాసంగి నుంచి కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ కేంద్రాల ఏర్పాటు యాసంగి పంటలు ప్రణాళికపై సికింద్రాబాద్లోని బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్లో రాష్ట్ర మార్కెట్ కమిటీ, వ్యవసాయ శాఖ అధికారులకు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు.
లాక్డౌన్లో రైతులు ఇబ్బందులు పడకూడదని పెద్దఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు. ఈ యాసంగి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని తెలియజేశారు. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులో ఎక్కడకూడా కనీస మద్దతు ధర అంశం లేదని ఆరోపించారు. పంటలు పండించడానికి కావలసిన సహకారం ప్రభుత్వం, వ్యవసాయ కేంద్రాలు అందచేస్తాయని వెల్లడించారు.
ఇదీ చదవండి : జీహెచ్ఎంసీ గెజిట్ నోటిఫికేషన్ జారీ.. మేయర్ ఎన్నికే తరువాయి!