ETV Bharat / state

రైతు కష్టానికి మంచి గిట్టుబాటు ధర దక్కాలి: నిరంజన్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ సాగు సానుకూల విధానాలతో తెలంగాణలో పంటల విస్తీర్ణం పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆరున్నరేళ్లలో రాష్ట్రం అన్నపూర్ణగా మారిందని హర్షం వ్యక్తం చేశారు.

Telangana as annapurna
తెలంగాణ అన్నపూర్ణ
author img

By

Published : Mar 29, 2021, 5:12 PM IST

రాష్ట్రంలో రైతు కష్టానికి మంచి గిట్టుబాటు ధర దక్కాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సాగు సానుకూల విధానాలతో తెలంగాణలో పంటల విస్తీర్ణం పెరిగిందని... ఆరున్నరేళ్లలో రాష్ట్రం అన్నపూర్ణగా మారిందని అనడానికి గత ఏడాది ఎఫ్‌సీఐ ధాన్యం సేకరణనే నిదర్శనమని తెలిపారు.

దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 55 శాతం కేవలం తెలంగాణ నుంచేనని మంత్రి స్పష్టం చేశారు. 2021-22 రాష్ట్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం ఆమోదం పొందిన సందర్భంగా మంత్రి ఓ విడుదల చేశారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలపై అవగాహనతో ముందుకు సాగాలని వివిధ సమావేశాలలో ముఖ్యమంత్రి సూచించారని గుర్తు చేశారు.

నాలుగు కోట్ల ఉత్పత్తులు...

శాస్త్రవేత్తలు, నిపుణుల సూచనల మేరకు తెలంగాణలో 4 కోట్ల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు వస్తాయని అంచనా వేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్, అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని వెల్లడించారు. అందుకోసం రూ. 15 కోట్లు ప్రభుత్వం బడ్జెట్​లో కేటాయించిందని వివరించారు.

మార్కెటింగ్ శాఖకు రూ. 6.5 కోట్లు...

ఇందులో భాగంగా మార్కెటింగ్ శాఖకు ముందస్తుగా రూ. 6.5 కోట్లు విడుదల చేసిన నేపథ్యంలో దేశంలో, రాష్ట్రంలో, అంతర్జాతీయంగా మార్కెట్ పరిణామాలు తెలుసుకుని రైతులకు మంచి ధర లభించేలా అవగాహన కల్పిచేందుకు ప్రతిష్ఠాత్మక సంస్థ ఎర్నెస్ట్, ఎంగ్‌కు అప్పగించినట్లు స్పష్టం చేశారు. సాగునీరు, రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు 24 గంటల ఉచిత కరెంట్ వంటి అనుకూల విధానాలతో తెలంగాణలో రైతులు సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారని... ఈ తరహాలో దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా సాగుకు ప్రోత్సాహం అందించడం లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చూడండి: మాస్కు లేకుండా బయటకు వస్తే జరిమానానే: జీహెచ్ఎంసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.