ETV Bharat / state

farming: క్యూఆర్ కోడ్ విధానంతో విత్తనాలు, బయోఫెర్టిలైజర్స్‌ : మంత్రి నిరంజన్ రెడ్డి

రాష్ట్ర ఆర్థిక పురోగాభివృద్ధికి వ్యవసాయరంగం ఎంతో ముఖ్యమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ రంగం అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. దేశ సగటుతో పోల్చితే వ్యవసాయ ఉత్పత్తుల్లో అగ్రభాగాన ఉన్నామని వెల్లడించారు. రైతులకు ఇబ్బందులకు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు.

farming, niranjan reddy
నిరంజన్ రెడ్డి, వ్యవసాయం
author img

By

Published : Jun 1, 2021, 2:47 PM IST

Updated : Jun 1, 2021, 2:56 PM IST

రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించేలా ప్రత్యేక ప్రణాళికను త్వరలో అమలు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయ పంటలకు సమానంగా ఉద్యానవన సాగు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. వెదజల్లే విధానంలో వరిసాగు, పత్తి, కంది, వేరుశెనగ పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసేలా రైతులకు అవగాహన కల్పిస్తామని మంత్రి తెలిపారు. కల్తీ విత్తనాలు, ఎరువుల తయారీదార్లపై కఠినచర్యలు తీసుకుంటున్నామన్నారు

వానాకాలంలో ప్రధాన పంటలే 1.4 కోట్ల ఎకరాలు వచ్చే అవకాశం ఉందన్నారు. వ్యవసాయరంగ అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతున్నాయని వెల్లడించారు. వానాకాలంలో వరిని కొంత మేర తగ్గించాలనుకుంటున్నట్లు తెలిపారు. 40-45లక్షల ఎకరాల్లోపే వరి వేస్తే మేలని భావిస్తున్నామని అన్నారు. క్యూఆర్ కోడ్ విధానంతో విత్తనాలు, బయోఫెర్టిలైజర్స్‌పై నియంత్రణ కోసం చట్టాలను సవరిస్తూ ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నామంటున్న వ్యవసాయశాఖ మంత్రితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

నిరంజన్ రెడ్డి, వ్యవసాయం

ఇదీ చదవండి: Cyber crimes: అప్రమత్తతోనే.. సైబర్‌ మోసాలకు అడ్డుకట్ట

Last Updated : Jun 1, 2021, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.