ETV Bharat / state

బోయిన్​పల్లి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా దేవీశరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడో రోజు వివిధ రూపాల్లో ప్రజలకు అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. హైదరాబాద్​లోని బోయిన్​పల్లిలో తెరాస యువ నాయకుడు టింకుగౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలకు మంత్రి మల్లారెడ్డి, జీహెచ్​ఎంసీ​ మేయర్ బొంతు రామ్మోహన్ హాజరయ్యారు.

MInister mallareddy patrticipated in boinpalli ammavari navaratrulu
బోయిన్​పల్లి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి
author img

By

Published : Oct 24, 2020, 4:51 AM IST

Updated : Oct 24, 2020, 7:35 AM IST

రాష్ట్రవ్యాప్తంగా దేవీశరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలో జరుగుతున్న వేడుకలకు మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి అమ్మవారికి పూజలు చేశారు. కరోనా వల్ల ప్రజలు తమ ఇళ్లవద్దనే వేడుకలు జరుపుకోవాలని సూచించారు. కరోనా, భారీ వర్షాల నుంచి ప్రజలను కాపాడాలని అమ్మవారిని వేడుకున్నారు.

బోయిన్​పల్లిలో గత 11 సంవత్సరాలుగా పెద్దఎత్తున అమ్మవారి ఉత్సవాలు జరుగుతుండడం సంతోషకరమని మంత్రి అన్నారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలకు పది వేలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి:బతుకమ్మ సంబురాలు సంతృప్తినిచ్చాయి: గవర్నర్

Last Updated : Oct 24, 2020, 7:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.