సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం మడ్ఫోర్ట్లోని సెయింట్ ఆంథనీ చర్చి ప్రాంగణంలో యంఏఆర్ఐ సంస్థ వారి ఆధ్వర్యంలో 390 మంది నిరుపేద ప్రజలకు నిత్యవసర, పరిశుభ్రత సామాగ్రిని పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి హాజరై సరుకులు అందజేశారు.
కార్మిక దినోత్సవం సందర్భంగా శ్రామికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపారు మంత్రి. లాక్డౌన్ సమయంలో నిరుపేద ప్రజలను ఆదుకుంటున్న దాతలు, స్వచ్చంద సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. మురికివాడల్లో నివసిస్తున్న ప్రజలు వ్యక్తిగత శుభ్రత, స్వీయ నియంత్రణతో పాటు భౌతిక దూరాన్ని కూడా పాటించాలని మల్లారెడ్డి కోరారు.