ETV Bharat / state

MALLAREDDY: 'రేవంత్ బ్లాక్​మెయిల్ కొత్తేమీకాదు.. అప్పట్లోనే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లా'

టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. దొంగ పత్రాలు చూపెట్టి రేవంత్​ తనను బ్లాక్​ మెయిల్​ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏవో కాగితాలు తీసుకొచ్చి తనపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. రేవంత్ బ్లాక్ మెయిల్ కొత్తేమీకాదన్నారు. అప్పట్లోనే రేవంత్ గురించి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు.

MALLAREDDY: 'రేవంత్ బ్లాక్​మెయిల్ కొత్తేమీకాదు.. అప్పట్లోనే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లా'
MALLAREDDY: 'రేవంత్ బ్లాక్​మెయిల్ కొత్తేమీకాదు.. అప్పట్లోనే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లా'
author img

By

Published : Aug 28, 2021, 2:44 PM IST

Updated : Aug 28, 2021, 4:22 PM IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నువ్వానేనా అనేలా ఇద్దరు పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి రేవంత్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పటినుంచి రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. తెదేపా మల్కాజ్‌గిరి సీటు రేవంత్‌కు కాకుండా తనకు ఇచ్చినందుకు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారన్నారు. బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని అప్పుడే తెదేపా అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు రేవంత్‌ రెడ్డి తనను ఇబ్బంది పెడుతూనే ఉన్నారని మల్లారెడ్డి ఆక్షేపించారు.

2012లో వైద్య కళాశాలను ప్రారంభించినట్లు మల్లారెడ్డి చెప్పారు. బాలికల కోసం ప్రత్యేకంగా మహిళా కళాశాలను స్థాపించినట్లు వెల్లడించారు. వసతి గృహాల్లో దాదాపు 7వేల మంది అమ్మాయిలు ఉంటున్నారన్నారు. ఏవో కాగితాలు తీసుకొచ్చి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దొంగ పత్రాలు చూపెట్టి తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అన్ని అనుమతులతోనే ఆస్పత్రిని నిర్మించినట్లు మంత్రి స్పష్టం చేశారు. తన కళాశాలలు, ఆస్పత్రులుకు సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగానే ఉన్నాయని.. తన సంస్థలను ఉన్నతంగా నడుపుతున్నట్లు వివరించారు. తాను ఎంపీగా రూ.200 కోట్ల అభివృద్ధి పనులు చేసినట్లు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఎంపీ అయ్యాక కూడా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఆక్షేపించారు. పార్లమెంటులో కూడా మల్లారెడ్డి విద్యా సంస్థల గురించి ప్రశ్నలు వేశారని.. తన విద్యా సంస్థల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పిందని వెల్లడించారు.

కేసీఆర్ వంటి దేవుణ్ని తిడితే సహించేది లేదని.. ప్రజలు చూస్తూ ఊరుకోరని మంత్రి హెచ్చరించారు. పెద్దలకు మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలన్నారు. చులకన చేయవద్దని.. తనకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారన్నారు. తనకున్న 600 ఎకరాల్లోని 400 ఎకరాల్లో కాలేజీలు ఉన్నాయని.. వాటికి రైతుబంధు ఎలా వస్తుందన్నారు. తాను పాలు, పూలు అమ్మి ఆస్తులు సంపాదించానని.. రేవంత్ ఎలా సంపాదించాడో చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే హుజురాబాద్​లో కాంగ్రెస్​కు డిపాజిట్ సాధించాలని మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు.

అన్ని అనుమతులతోనే ఆస్పత్రి నిర్మించాం. నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. తెదేపా మల్కాజిగిరి సీటు రేవంత్‌కు కాకుండా నాకు వచ్చిందని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. అలా చేస్తున్నాడని అప్పుడు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాను. రేవంత్‌రెడ్డి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. కళాశాలలు, ఆస్పత్రులకు సంబంధించిన దస్త్రాలన్నీ సక్రమమే. 2002లో ఇంజినీరింగ్ కళాశాల, 2012లో వైద్య కళాశాల ప్రారంభించాం. బాలికల కోసం ప్రత్యేకంగా మహిళా కళాశాల స్థాపించాం. నా వసతిగృహాల్లో దాదాపు 7 వేలమంది అమ్మాయిలు ఉంటున్నారు. ఏవో కాగితాలు తీసుకొచ్చి నాపై ఆరోపణలు చేస్తున్నారు. దొంగ పత్రాలు చూపెట్టి తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. తన సంస్థలను ఉన్నతంగా నడుపుతున్నా. తాను ఎంపీగా 200 కోట్ల అభివృద్ధి పనులు చేశా. రేవంత్‌రెడ్డి ఎంపీ అయ్యాక కూడా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. -మల్లారెడ్డి, కార్మిక శాఖ మంత్రి

ఇదీ చదవండి: REVANTH REDDY: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి నాంపల్లి కోర్టు సమన్లు

Last Updated : Aug 28, 2021, 4:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.