ETV Bharat / state

ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు.. దావోస్​కు మంత్రి కేటీఆర్ పయనం - స్విట్జర్లాండ్ వెళ్లనున్న కేటీఆర్

KTR Davos Tour: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈ నెల 16 నుంచి 20 వరకు జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సుకు భారత్‌ నుంచి రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరుకానున్నారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు దావోస్​లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కావడం కోసం మంత్రి కేటీఆర్ ఇవాళ రాత్రి స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు.

KTR
KTR
author img

By

Published : Jan 14, 2023, 7:25 PM IST

KTR Davos Tour: ఈ నెల 16 నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు భారీ స్థాయిలో జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రభుత్వాధినేతలు, వ్యాపార దిగ్గజాలు, అంతర్జాతీయ సంస్థల సారథులు దీనికి హాజరుకానున్నారు. భారత్‌ నుంచి పలువురు వెళ్లనున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు, సీఈవోలు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ రాత్రికి స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు.

నిర్వాహకుల ఆహ్వానం మేరకు దావోస్​లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు మంత్రి హాజరు కానున్నారు. పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ధ్యేయంగా కేటీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర బృందం దావోస్​లో పర్యటించనుంది. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్​ రంజన్, అధికారులు బృందంలో ఉండనున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 20 వరకు జరగనున్న సదస్సుకు పలు దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు, పలువురు వ్యాపార, వాణిజ్య ప్రముఖులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు.

రాష్ట్రానికి వివిధ రంగాల్లో పెట్టుబడులే లక్ష్యంగా కేటీఆర్ నేతృత్వంలోని బృందం పర్యటన సాగనుంది. సదస్సులో పాల్గొనడంతో పాటు పలువురు వ్యాపార, వాణిజ్యవేత్తలు, కంపెనీల అధినేతలతో కేటీఆర్ సమావేశమవుతారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలు తదితరాలను వారికి వివరిస్తారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా వారితో చర్చలు జరిపి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరతారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.