ETV Bharat / state

నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం : కేటీఆర్

KTR Tweet on demonetization : ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన నివేదికపై మంత్రి కేటీఆర్ స్పందించారు. నోట్ల రద్దు అంశం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపించిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వ్యక్తి చేసిన ట్వీట్​కు కేటీఆర్ బదులిచ్చారు.

KTR Tweet on demonetization
KTR Tweet on demonetization
author img

By

Published : Nov 7, 2022, 11:47 AM IST

KTR Tweet on demonetization: నోట్ల రద్దు అంశం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన నివేదికను పేర్కొంటూ విష్ణువర్దన్​రెడ్డి అనే వ్యక్తి చేసిన ట్వీట్​కు స్పందించిన కేటీఆర్.. నోట్ల రద్దు నిర్ణయం ఘోర వైఫల్యమని విమర్శించారు. ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థను నోట్ల రద్దు నిర్ణయం తీవ్రంగా దెబ్బ తీసిందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే సగం సగం ఆలోచనల వల్ల 8 త్రైమాసికాలు మందగమానికి గురయ్యాయని కేటీఆర్ తెలిపారు. నోట్ల రద్దుకు తోడు 2020 లాక్​డౌన్​ వల్ల శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బ తగిలిందని మంత్రి అభిప్రాయపడ్డారు.

  • What a colossal failure this Demonetisation was & let’s not forget how it crippled the growing Indian economy

    This half-baked idea led to 8 consecutive quarters of slowdown, subsequently landing in Lockdown in 2020 serving a body blow to the vibrant economy https://t.co/8fW8f1pjoN

    — KTR (@KTRTRS) November 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తీపి జ్ఞాపకం..: మంత్రి కేటీఆర్ చేసిన మరో ట్వీట్​కు అభిమానులు ఫిదా అవుతున్నారు. కేటీఆర్.. తనకు సంబంధించిన ఓ తీపి జ్ఞాపకాన్ని ట్విటర్​ వేదికగా పంచుకున్నారు. 20 ఏళ్ల క్రితం తీసుకున్న తన ఫొటోను.. ప్రస్తుత ఫొటోతో జత చేస్తూ ట్విటర్​లో పోస్ట్​ చేశారు. '20 ఇయర్స్​ ఎగో.. అండ్​ నౌ' అని ఆ ఫొటోకు క్యాప్టన్​ పెట్టారు. ఈ ఫొటో చూసిన అభిమానులు ఎవర్​గ్రీన్ యంగ్ లీడర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవీ చూడండి..

అభివృద్ధికే పట్టం.. భాజపాకు ఇది చెంప పెట్టులాంటి తీర్పు: కేటీఆర్

మునుగోడుపై కేఏ పాల్ బాంబులు.. వెంటనే పారిపోండి: ఆర్జీవీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.