ETV Bharat / state

KTR: 'ప్రతిపక్షాల ఆరోపణలను ఎక్కడిక్కడ తిప్పికొట్టాలి' - హైదరాబాద్ జిల్లా వార్తలు

విపక్షాల్లో కొత్త నేతలు బాధ్యతలు చేపట్టినందున.. దూసుకెళ్లేందుకు ఉత్సాహపడతారని... ఆ సమయంలో వారు చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పార్టీ ప్రధాన కార్యదర్శులకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(ktr) సూచించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక(huzurabad by-election) ఎప్పుడు జరిగినా సీఎం కేసీఆర్ నిర్దేశించిన వ్యూహాలను అమలు చేసేందుకు పార్టీ నాయకులందరూ సిద్ధంగా ఉండాలన్నారు. పార్టీ సభ్యుల వివరాలను ఈనెల 20లోగా డిజిటలీకరణ పూర్తి చేయాలని.. రెండు నెలల్లో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తికావాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతీ నియోజకవర్గంలో సోషల్ మీడియా కమిటీ ఏర్పాటు చేయాలని తెరాస నిర్ణయించింది.

Minister KTR meeting, ktr suggestions to trs primary secretaries on by-election
ఉపఎన్నికపై ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సమావేశం, తెలంగాణ భవన్‌లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశం
author img

By

Published : Jul 14, 2021, 8:07 PM IST

ప్రతిపక్షాల ఆరోపణలను, దుష్ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని పార్టీ నేతలకు తెరాస(TRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) దిశానిర్దేశం చేశారు. విపక్ష పార్టీలకు కొత్త నాయకులు నాయకత్వం చేపట్టినందున... రకరకాల పేర్లతో ప్రజల వద్దకు వెళ్తారని.. ఆ సందర్భంలో వారు చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు. నిరంతరం ప్రజల్లో ఉండి.. తెరాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. దళిత సాధికారత, ఉద్యోగాల కల్పన, ఉచిత విద్యుత్, రైతుబంధు, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. తెలంగాణ భవన్‌లో తెరాస ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

'సిద్ధంగా ఉండాలి'

హుజురాబాద్ ఉపఎన్నికలు ఎప్పుడు జరిగినా పార్టీ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. కేసీఆర్ దిశానిర్దేశంతో నాయకులందరూ రంగంలోకి దిగాలన్నారు. తెరాస సభ్యత్వ నమోదు, డిజిటలీకరణ, సంస్థాగత నిర్మాణంపై సమీక్షించారు. 61 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకోవడంపై కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెరాస మినహా ఏ ప్రాంతీయ పార్టీకి ఇంత భారీ సభ్యత్వం లేదన్నారు. హైదరాబాద్‌లో పార్టీ సభ్యత్వాన్ని పెంచాలన్నారు. డిజిటలీకరణ, ప్రమాద బీమా సదుపాయం ప్రక్రియ కూడా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటి వరకు 48 లక్షల సభ్యుల వివరాలు డిజిటలీకరణ జరిగిందని మంత్రి కేటీఆర్‌కు పార్టీ ప్రధాన కార్యదర్శులు తెలిపారు. మిగతా సభ్యుల డిజిటలీకరణ ఈనెల 20లోపు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

దురదృష్టవశాత్తు ఏ కార్యకర్త మరణించినా ప్రమాద బీమా అందేలా ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలి. రెండు నెలల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలి. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం చేపట్టగా.. రెండు నెలల్లో పూర్తయ్యేలా శ్రద్ధ తీసుకోవాలి. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ స్వయంగా వాటిని ప్రారంభిస్తారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సోషల్ మీడియా కమిటీ ఏర్పాటు చేస్తాం.

-కేటీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు

రాష్ట్రంలో 24 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తయిందని.. మరో 7 జిల్లాల్లో 95శాతం పూర్తయిందని పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కృష్ణా జలాలపై లేనిహక్కుల కోసం ఏపీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు కడతామని.. నీళ్లు దొంగిలిస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. కృష్ణా జలాలపై హక్కులను కాపాడుకుంటామని అన్నారు.

ఇదీ చదవండి: TS HIGH COURT: హైకోర్టులో విజయశాంతికి చుక్కెదురు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.