ETV Bharat / state

'హైదరాబాద్‌ గులాబీలు కావాలా... గుజరాతీ గులాములు కావాలా?' - Ktr on Kishan reddy

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్‌నగర్‌ స్టేడియం వద్ద పురపాలక మంత్రి కేటీఆర్‌... రోడ్ షో నిర్వహించారు. ఆరేళ్లలో తెరాస చేసిన అభివృద్ధిని వివరిస్తూనే కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

'హైదరాబాద్‌ గులాబీలా... గుజరాతీ గులాములు కావాలా?'

author img

By

Published : Nov 23, 2020, 7:00 PM IST

Updated : Nov 23, 2020, 8:02 PM IST

హైదరాబాద్​కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సరూర్‌నగర్‌ పరిధి ఎన్టీఆర్‌ నగర్‌లో కేటీఆర్‌ రోడ్‌షో నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థలు హైదరాబాద్‌కు వస్తున్నాయన్న ఆయన... కేసీఆర్‌ సమర్ధ నాయకత్వం కారణంగానే ఐటీ అభివృద్ధి చెందిందని ఉద్ఘాంటించారు.

సరూర్​నగర్​లో మంత్రి కేటీఆర్ రోడ్​షో

ఏ సమస్య వచ్చినా జనంలోకి వెళ్లింది తెరాస నాయకులే. గల్లీ పార్టీ కావాలా? దిల్లీ పార్టీ కావాలా? హైదరాబాద్‌ గులాబీలు కావాలా? గుజరాతీ గులాములు కావాలా? తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి వెళ్తే... ఆఠాణా మాత్రమే వెనక్కి వస్తోంది.

--- రోడ్​షోలో కేటీఆర్

ఆరేళ్లలో తెలంగాణ నుంచి రూ.2.70లక్షల కోట్ల పన్నులు కేంద్రానికి వెళ్లగా... కేంద్రం నుంచి మాత్రం రూ.1.4 లక్షలు మాత్రమే వచ్చాయని ఆరోపించారు. రూ.10 వేల సాయం ఆపినోళ్లు... రూ.25 వేలు ఇస్తారా? అని ఎద్దేవా చేశారు. వరద సాయం కోసం కేంద్రానికి లేఖ రాసి 8 వారాలైనా... ఇంతవరకు కేంద్రం నుంచి ఉలుకూపలుకూ లేదని విమర్శించారు.

మతం పేరుతో హైదరాబాద్‌లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంత హైదరాబాదా? లేక తల్లడిల్లే హైదరాబాద్‌ కావాలా?ఆలోచించాలి. అభివృద్ధి కావాలా? అరాచకం కావాలా? ప్రజలు ఆలోచించాలి.

--- రోడ్​షోలో కేటీఆర్

భాజపా నేతలు హైదరాబాద్‌లో చలాన్లు కడుతామంటున్నారన్న మంత్రి... అహ్మదాబాద్, బెంగళూరులలో చలాన్లు కడుతున్నారా అని ప్రశ్నించారు.

సరూర్​నగర్​లో మంత్రి కేటీఆర్ రోడ్​షో

ఇవీ చూడండి: తెరాస గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల... ముఖ్యాంశాలివే

Last Updated : Nov 23, 2020, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.