ETV Bharat / state

మూసీకి ఇరువైపులా ఫోర్ వే... యోచనలో సర్కారు - జీహెచ్​ఎంసీ పనులను సమీక్షించిన కేటీఆర్

హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని జీహెచ్​ఎంసీ చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. పలు శాఖల ఉన్నతాధికారులతో జీహెచ్‌ఎంసీ కార్యాల‌యంలో మంత్రి సమీక్ష నిర్వహించారు.

Minister ktr review on hyderbad mp Constituency
మూసీకి ఇరువైపులా నాలుగు లేన్ల రోడ్ల యోచనలో సర్కారు
author img

By

Published : Mar 18, 2020, 6:19 PM IST

జీహెచ్​ఎంసీ పనులను సమీక్షించిన కేటీఆర్

హైద‌రాబాద్ పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో జీహెచ్‌ఎంసీ చేప‌ట్టిన‌ ప‌నుల‌ను వేగంగా పూర్తి చేయాలని పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ కార్యాల‌యంలో నిర్వహించిన‌ స‌మావేశంలో ఎస్‌ఆర్‌డీపీ కింద మంజూరు చేసిన ఫ్లై ఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌లు, ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జిలు తదితర పనులపై మంత్రి సమీక్షించారు. రోడ్ల విస్తర‌ణ ప‌నులు, మెట్రో లైన్ నిర్మాణానికి అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ, మంచినీటి స‌ర‌ఫ‌రా పైప్‌లైన్ల నిర్వహ‌ణ‌, క్రీడా మైదానాల నిర్మాణం, నాలాల వెడ‌ల్పు త‌దిత‌ర మౌలిక వ‌స‌తుల ప‌నుల ప్రగ‌తిని మంత్రి తెలుసుకున్నారు.

నాలాల విస్తరణకు రూ. 200 కోట్లు..

ఈ పార్లమెంట్ ప‌రిధిలోని అన్ని వీడీసీసీ రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాద‌న‌లు రూపొందించాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆయన ఆదేశించారు. తాగునీటి స‌ర‌ఫ‌రాలో పైప్‌లైన్ల లీకేజీల వ‌ల‌్ల ప్రజ‌ల‌కు క‌లుగుతున్న ఇబ్బందుల‌ను తొల‌గించి దెబ్బతిన్న పైప్‌లైన్ల స్థానంలో కొత్త పైప్‌లైన్లు వేయాలని సూచించారు. నాలాల విస్తర‌ణ‌కు రూ. 200 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మౌలిక వ‌స‌తుల విస్తర‌ణ‌లో భాగంగా 20 రోడ్ల వెడ‌ల్పు, ప్రతిపాదిత మెట్రో రైలు మార్గంలో ప‌నులు చేప‌ట్టేందుకు అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ ప్రక్రియ‌ను వేగ‌వంతం చేసేందుకు ప్రత్యేక అధికారిని నియ‌మించాల‌ని జీహెచ్‌ఎంసీ క‌మీష‌న‌ర్‌కు సూచించారు.

మూసీకి ఇరువైపులా.. నాలుగు లేన్లు

రోడ్ల విస్తర‌ణ‌కు సానుకూలంగా స్పందించిన వారి ఆస్తుల‌ను వెంట‌నే సేక‌రించాల‌ని, నిబంధ‌న‌ల ప్రకారం చెల్లింపులు జ‌రిపి సంబంధిత ఆస్తుల‌ను స్వాధీనం చేసుకొని నిర్మాణాల‌ను కూల్చివేయాల‌ని మంత్రి పేర్కొన్నారు. భూసేక‌ర‌ణ‌లో పార్లమెంట్‌, శాస‌నస‌భ్యుల స‌హ‌కారాన్ని తీసుకోవాల‌ని అధికారుల‌కు స్పష్టం చేశారు. రైల్వే అధికారుల‌తో ఎప్పటిక‌ప్పుడు చ‌ర్చించి రైల్వే అండ‌ర్ పాస్ ప‌నుల‌ను పూర్తిచేయాల‌ని సూచించారు. ఈస్ట్- వెస్ట్ కారిడార్‌లో భాగంగా మూసీ న‌దికి ఇరువైపులా నాలుగు లేన్ల రోడ్డును నిర్మించాల‌ని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు.

గజ్వేల్​ తరహాలో మోడల్ మార్కెట్లు..

స్థలాల అందుబాటును బ‌ట్టి గ‌జ్వేల్ త‌ర‌హాలో ఇంటిగ్రేటెడ్‌ మోడ‌ల్ మార్కెట్ల‌ను నిర్మించేందుకు ప్రతిపాదనలు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్రజ‌ల్లో ఆరోగ్య సంర‌క్షణ ప‌ట్ల శ్రద్ధ పెరిగినందు వల్ల పార్కుల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. పార్కుల‌లో షీ టాయిలెట్లు, ప‌బ్లిక్ టాయిలెట్లు నిర్మించాల‌ని తెలిపారు. వేస‌విలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళిక చేయాలని జలమండలి ఎండీ దాన‌కిషోర్‌కు సూచించారు.

ఇవీ చూడండి: సీతారాములను వదలని కరోనా.. కల్యాణంపై కొవిడ్​-19 ఎఫెక్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.