పురపాలక శాఖ పనితీరుపై 2020-21 వార్షిక నివేదికలను మంత్రి కేటీఆర్ (ktr) విడుదల చేశారు. గతేడాదిలో చేసిన పనులను నివేదికలో పొందుపరచడమే కాకుండా 2021-22 కార్యాచరణను అందులో పేర్కొన్నారు. కరోనా భయానక పరిస్థితుల్లో నిస్వార్థ సేవలు అందించిన పురపాలశాఖ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకొని పట్టణాల్లో మౌలిక సదుపాయల పనులు పూర్తి చేసినట్లు వివరించారు. అన్ని పట్టణాల్లోనూ వ్యర్థాలు, మానవ వ్యర్థాల శుద్ధిప్లాంట్లు ఉన్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని పేర్కొన్నారు. మూసీనదిపై 15 కొత్త వంతెనలు ఏర్పాటుకు నిర్ణయించినట్లు తెలిపారు. పీఎం స్వనిధి అమల్లో దేశంలోనే ముందంజలో ఉన్నందుకు అధికారులను అభినందించారు.
-
Minister @KTRTRS released the Municipal Administration & Urban Development Dept's Annual Report 2020-21 today in the presence of Prl. Secretary @arvindkumar_ias, @cdmatelangana Satyanarayana, @hmrgov MD NVS Reddy, @HMWSSBOnline MD Dana Kishore, @CommissionrGHMC Lokesh Kumar. pic.twitter.com/bQW3dDemxr
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Minister @KTRTRS released the Municipal Administration & Urban Development Dept's Annual Report 2020-21 today in the presence of Prl. Secretary @arvindkumar_ias, @cdmatelangana Satyanarayana, @hmrgov MD NVS Reddy, @HMWSSBOnline MD Dana Kishore, @CommissionrGHMC Lokesh Kumar. pic.twitter.com/bQW3dDemxr
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 9, 2021Minister @KTRTRS released the Municipal Administration & Urban Development Dept's Annual Report 2020-21 today in the presence of Prl. Secretary @arvindkumar_ias, @cdmatelangana Satyanarayana, @hmrgov MD NVS Reddy, @HMWSSBOnline MD Dana Kishore, @CommissionrGHMC Lokesh Kumar. pic.twitter.com/bQW3dDemxr
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 9, 2021
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత
పట్టణాల సమీకృత సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాబోయే ఏళ్లలో పురోగతిని కొనసాగిస్తామని చెప్పారు. పీఎం స్వనిధిని దేశంలోనే ప్రథమంగా అమలు చేసిన తెలంగాణలో వీధివ్యాపారులకు 347 కోట్ల రుణాలు ఇచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. 184 కోట్లతో హైదరాబాద్ దుర్గం చెరువు వద్ద తీగల వంతెన, లైటింగ్, వాస్తు, శిల్పకాంతుల పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. జీడిమెట్ల వద్ద రోజుకు 500 టన్నుల సామర్థ్యంతో మొట్టమొదటి నిర్మాణ, కూల్చివేతల నిర్వహణ ప్లాంటుతో పాటు జవహర్ నగర్ వద్ద దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి 19.8 మెగావాట్ల సామర్థ్యంతో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు పురపాలకశాఖ తెలిపింది.
చేసిన పనుల జాబితా..
ఓఆర్ఆర్పై మిగిలిన 136 కిలోమీటర్ల పొడవునా ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు... పది ట్రామా రక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. వీటి ద్వారా ఇప్పటి వరకు 110కి మందికిపైగా సత్వర చికిత్స అందించి విలువైన ప్రాణాలు కాపాడడంతో పాటు 225 మందికి ప్రాథమిక చికిత్స అందించినట్లు తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో నెలకు 20వేల లీటర్ల చొప్పున ఉచితంగా మంచినీటి పథకాన్ని ప్రారంభించినట్లు పేర్కొంది. మొదటి లాక్డౌన్ సమయంలో 373 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఉచిత భోజనం అందించినట్లు, 2020-21లో 2.53 కోట్ల భోజనాలు అందించినట్లు తెలిపింది. జీహెచ్ఎంసీలో 224 బస్తీ దవాఖానాలు ఉండగా... ప్రారంభానికి మరో 31 సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. ఫ్లైఓవర్లు, ఆర్యూబీ, అండర్ పాసులు పూర్తి చేయడంతో పాటు 28 కిలోమీటర్ల మేర 16 గ్రీన్‌ఫీల్డ్ లింక్ రోడ్లు పూర్తి చేసినట్లు వివరించింది.
గ్రేటర్లో నర్సరీలకు ప్రాధాన్యం
స్వయం సహయక బృందాలకు 1,759 కోట్ల రుణాలు అందించినట్లు నివేదిక తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో నర్సరీల సంఖ్య 168 నుంచి 1002కు పెరిగాయని... జీహెచ్ఎంసీలో 600 నర్సరీలు, 1,401 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. జీహెచ్ఎంసీ మినహా 141 పట్టణాల్లో 4,118 పబ్లిక్ టాయిలెట్లు పూర్తి చేయడంతో పాటు 1898 శానిటేషన్ వాహనాలు సమీకరించినట్లు తెలిపింది. ఏడు పట్టణాల్లో మానవ వ్యర్థాలు శుద్ధి చేసేందుకు ఎఫ్.ఎస్.టి.పి.లు, 15 పట్టణాల్లో జంతుసంరక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించింది.
మరిన్ని అభివృద్ధి పనులు
పట్టణ ప్రగతి కింద రూ.2,062 కోట్లు విడుదల చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. వరంగల్, ఖమ్మం నగరాల్లో రోజువారీ మంచినీటి సరఫరా ప్రారంభమైందని... నిజామాబాద్, సిద్దిపేటలో 543 కోట్లతో భూగర్భ మురుగునీటి పథకాలు పూర్తి చేసిటన్లు తెలిపారు. 38 కోట్లతో ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులు చివరిదశలో ఉన్నాయని, 26 కోట్లతో వీడీసీసీ రోడ్ సహా నెక్లెస్ రోడ్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఓఆర్ఆర్ పైనున్న 19 ఇంటర్ ఛేంజ్‌ల వద్ద ల్యాండ్ స్కేపింగ్ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. భాగ్యనగరంలోని నాలాల సమగ్ర అభివృద్ధి కోసం నాలా అభివృద్ధి ప్రాజెక్టు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
చేపట్టబోయే పనుల వివరాలు
2021-22లో పురపాలక శాఖ కార్యాచరణను కూడా నివేదికలో పేర్కొన్నారు. 858 కోట్ల వ్యయంతో 15 ప్యాకేజీల కింద 49 నాలా అభివృద్ధి ప్రాజెక్టు పనులు చేపట్టనున్నట్లు పురపాలకశాఖ తెలిపింది. 2,067 పట్టణ ప్రకృతి వనాలను, 400 కిలోమీటర్ల మేర రహదార్ల వెంట మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ పూర్తి చేసినట్లు పేర్కొంది. వరంగల్‌లో వ్యర్థాల బయోమైనింగ్ ప్రాజెక్టు ప్రారంభమవుతుందని... పట్టణాల్లో బయోమైనింగ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎఫ్.ఎస్.టి.పి.లు పూర్తి చేయనున్నట్లు తెలిపింది.
- 38 పట్టణాల్లో రూ.1433 కోట్లతో నీటిసరఫరా పథకాలు
- 700 కోట్ల వ్యయంతో సమీకృత శాఖాహార, మాంసాహార మార్కెట్లు
- ఓఆర్ఆర్ వెంట మీడియన్, అవెన్యూలపై ఆటోమేటెడ్ బిందు సేద్యం
- 61 కోట్లతో నవంబర్ నాటికి మెహిదీపట్నం, ఉప్పల్‌లో స్కైవాక్ నిర్మాణాలు
- కొత్వాల్‌గూడ సమీపంలో 85 ఎకరాల స్థలంలో ఎకో పార్క్ ఏర్పాటు
- కోకాపేట నియోపోలిస్ వద్ద గ్రీన్ ఫీల్డ్ టౌన్షిప్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు
ఇదీ చూడండి: KTR: ఎంఎస్ఎంఈలకు ఊరట కల్పించండి.. కేంద్రానికి కేటీఆర్ లేఖ