ETV Bharat / state

KTR TWEET: బండి సంజయ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా... కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ - Telangana politics

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తీర్చట్లేదని... దరఖాస్తుల ఉద్యమం ప్రారంభించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయాన్ని... మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి ప్రస్తావిస్తూ మంత్రి ట్వీట్ చేశారు.

KTR TWEET
ట్వీట్లతో మాటలు
author img

By

Published : Aug 17, 2021, 10:35 AM IST

Updated : Aug 17, 2021, 11:04 AM IST

రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి.. ప్రభుత్వానికి పంపేందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దరఖాస్తుల ఉద్యమం ప్రారంభించారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.

'మీ దరఖాస్తుల ఉద్యమం ఆహ్వానించ తగ్గదే. తెలంగాణ భాజపా శాఖ నిర్ణయాన్ని నేను కూడా స్వాగతిస్తున్నా. ప్రధాని నరేంద్ర మోదీ వాగ్ధానం మేరకు ప్రతి పౌరుడికి రూ.15 లక్షలు ఇవ్వాలి. జన్​ధన్​ ఖాతాల్లోకి డబ్బులు పండేందుకు దరఖాస్తులు పంపాలి. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోండి.'

-మంత్రి కేటీఆర్

  • I welcome this move of BJP Telangana to invite applications for the ₹15 lakh to each citizen as promised by Hon’ble PM Modi Ji

    Request all eligible Telangana residents to send their applications to BJP Leaders for receiving this benefit DhanaDhan into their JanDhan accounts 👍 https://t.co/jM4wuOhy7g

    — KTR (@KTRTRS) August 17, 2021
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

అసలు ఏంటీ దరఖాస్తుల ఉద్యమం?

రాష్ట్రంలో తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు బండి సంజయ్ ప్రయత్నించగా.. మంత్రి కేటీఆర్ సంజయ్​పైనే కౌంటర్​ వేశారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ హామీలను అమలయ్యేలా ఒత్తిడి తీసుకొచ్చి, తెలంగాణ ప్రజలకు మేలు చేకూర్చేలా దరఖాస్తుల ఉద్యమం చేస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ‘బీసీ బంధు’, ‘గిరిజన బంధు’ పథకాలను ప్రభుత్వం వెంటనే రూపొందించి... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 60 లక్షల మంది బీసీ కుటుంబాలు, 10 లక్షల గిరిజన, ఆదివాసీ కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున లబ్ధి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీటితోపాటు నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్​రూం ఇళ్లు, దళిత, గిరిజనులకు 3 ఎకరాల భూమి, రైతు రుణమాఫీ హామీలను అమలు చేయాలని కోరుతూ... అర్హులైన వారు దరఖాస్తు చేయాలని.. సూచించారు. ఈనెల 24 నుంచి చేపట్టనున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’లో పాదయాత్ర దారిపొడవునా దరఖాస్తుల ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

  • ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు అర్హులైన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి ప్రభుత్వానికి పంపేందుకు బిజెపి కరీంనగర్ జిల్లా శాఖ చేపట్టిన ‘దరఖాస్తుల ఉద్యమాన్ని’ ప్రారంభించడం జరిగింది. pic.twitter.com/kV0bNPedYD

    — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఎవరూ చేయట్లే...

ఇటు రాష్ట్రం, అటు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నేరవేర్చడంలేదని అర్థమవుతోంది. ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను మభ్య పెట్టేందుకే ఈ హామీలను ఇస్తున్నారని... గెలిచిన తర్వాత వాటిని విస్మరిస్తున్నారని మరోమారు స్పష్టమైంది.

ఇదీ చూడండి: Bandi sanjay: దళిత బంధు సభకు మీడియాను ఎందుకు అనుమతించరు.?

Last Updated : Aug 17, 2021, 11:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.