కరోనాకి సరైన మందు, టీకా లేని ఈ సమయంలో నివారణ, ఉపశమనం మాత్రమే మన చేతుల్లో ఉన్నాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగర శివారు బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల రూపొందించిన 'పోస్ట్ లాక్డౌన్ రీస్టార్ట్ మాన్యువల్ ' అనే పుస్తకాన్ని కేటీఆర్ చేతుల మీదగా ఆవిష్కరించారు.
ఈ పుస్తకం విద్యా సంస్థలకు కరదీపిక కాగలదని కేటీఆర్ అభిప్రాయపడ్డారని కళాశాల నిర్వాహకులు తెలిపారు. కళాశాల, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకేతర సిబ్బందికి, కళాశాల పరిసర ప్రాంతాలలో ఉండే వివిధ వర్గాల ప్రజలకు దన్నుగా నిలిచి.. తగు సహకారమందించాలని కోరినట్లు పేర్కొన్నారు.
ప్రధానమంత్రి మోదీ సూచించిన సప్తపది, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సమాజానికి చేరువయ్యోలా వీఐ మెడిసిన్ ప్రధాన ఇతివృత్తంగా ఈ పునఃప్రారంభ కరదీపికను రూపొందించామని విజ్ఞానజ్యోతి సంస్థ అధ్యక్షుడు డాక్టర్ డీఎన్ రావు తెలిపారు.
ఇదీ చూడండి: ఆసిఫాబాద్‌లో రెండోరోజు డీజీపీ మహేందర్రెడ్డి పర్యటన