ETV Bharat / state

ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి... కేటీఆర్ దిశానిర్దేశం - హైదరాబాద్ తాజా వార్తలు

ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని తెరాస శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో విపక్షాలు చెబుతున్న అబద్ధాలను ఎండగట్టాలన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో వెళ్తుంటే.. ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని కేటీఆర్ దుయ్యబట్టారు. రానున్న శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

minister ktr on opposition parties
ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి... కేటీఆర్ దిశానిర్దేశం
author img

By

Published : Sep 26, 2020, 9:17 PM IST

మహబూబ్​నగర్​, రంగారెడ్డి, హైదరాబాద్​ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం తెరాస ఓటరు నమోదు ఇంఛార్జ్​లతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అవాస్తవాలను ప్రజల్లో తీసుకెళ్లేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని.. వాటిని తెరాస శ్రేణులు గట్టిగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు.

శ్రేణులకు కేటీఆర్ పిలుపు

రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తూ ముందుకు పోతున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల, వాటి వల్ల ప్రజలకు అందుతున్న ప్రతి ఫలాలను ఓర్వలేక ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని కేటీఆర్ ధ్వజమెత్తారు. ముఖ్యంగా ఉద్యోగాల కల్పనలో ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టి వాస్తవాలను ప్రజల్లోకి గణాంకాలతో సహా తీసుకువెళ్లాలని కేటీఆర్ వివరించారు.

15 లక్షల మందికి ఉపాధి

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిందని.. మరోవైపు టీఎస్ఐపాస్ ద్వారా సుమారు 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను విద్యాధికులకు చేర్చేందుకు తెరాస శ్రేణులు ప్రయత్నించాలని సూచించారు. త్వరలోనే రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు పోతున్నారన్నారని తెలిపారు.

అక్టోబరు 1 నుంచి....

రంగారెడ్డి, మహబూబ్​నగర్, హైదరాబాద్ జిల్లాల్లో తెరాస బలమైన శక్తిగా ఉన్నదని.. ప్రతీ ఎన్నికల్లోనూ తన బలాన్ని చాటుకున్నదని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తే పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ఏమాత్రం వెనుకాడరని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. అక్టోబర్ 1న ప్రజా ప్రతినిధులు, నాయకులు తమ కుటుంబ సభ్యులతో పాటు ఓటు నమోదు చేయించుకోవాలని అన్నారు. తాను కూడా అదే రోజున ఓటరుగా నమోదు చేయించుకోనున్నట్లు కేటీఆర్ తెలిపారు.

ఇదీ చదవండి: కర్నాటక మీదుగా ఆవర్తనం.. దక్షిణ తెలంగాణకు వర్షగండం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.