ETV Bharat / state

మరో 25 సీట్లు అదనంగా వస్తాయనుకున్నాం: కేటీఆర్

గ్రేటర్​ ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితం రాలేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గ్రేటర్‌ ఫలితాలు చూసి నిరాశ చెందనక్కర్లేదని సూచించారు.

మరో 25 సీట్లు అదనంగా వస్తాయనుకున్నాం: కేటీఆర్
మరో 25 సీట్లు అదనంగా వస్తాయనుకున్నాం: కేటీఆర్
author img

By

Published : Dec 4, 2020, 8:51 PM IST

Updated : Dec 4, 2020, 9:03 PM IST

తెరాస ఆశించిన విధంగా ఫలితం రాలేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. మరో 25 సీట్లు అదనంగా వస్తాయని ఆశించినట్లు ఆయన చెప్పారు. 10-12 స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైనట్లు వెల్లడించారు.

గ్రేటర్‌ ఫలితాలు చూసి నిరాశ చెందనక్కర్లేదని కార్యకర్తలకు కేటీఆర్​ సూచించారు. బల్దియాలో అతిపెద్ద పార్టీగా తెరాస అవతరించినట్లు చెప్పుకొచ్చారు. ఈ ఫలితాలను విశ్లేషించుకుని ముందుకు వెళ్తామన్నారు. ఎన్నికల్లో శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషిచేసిన సోషల్‌ మీడియా వారియర్స్‌కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు.

మరో 25 సీట్లు అదనంగా వస్తాయనుకున్నాం: కేటీఆర్

ఇదీ చదవండి: ఢీ అంటే ఢీ అంటున్న కారు, కమలం... పాతబస్తీలో పతంగి హవా

Last Updated : Dec 4, 2020, 9:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.