దేశంలోనే తొలిసారిగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ఓ వెబ్ పోర్టల్ వచ్చింది. రాజన్నసిరిసిల్ల జిల్లా పోతుగల్ పీఏసీఎస్ వెబ్‌సైట్‌ను పురపాలక, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సొసైటీ అందిస్తున్న రుణాలు, రుణాలకు సంబంధించిన ప్రక్రియ, ఇతర సేవలకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైట్లో పొందుపరిచారు. సహకార సంఘం ద్వారా రానున్న పెట్రోల్ బంకులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఏటీఎంలు, కార్యాలయాలతో పాటు ధాన్యం సేకరణ వంటి సేవలు, డిపాజిట్లు, లాకర్లు లాంటి వివరాలను కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
తెలుగు, ఆంగ్లం భాషల్లో వెబ్‌సైట్‌ను సిద్ధం చేశారు. రైతులకు సంబంధించిన వార్తలు, సొసైటీ అందించే ఇతర సౌకర్యాలను కూడా వెబ్సైట్లో పొందుపర్చనున్నారు. సొంతంగా వెబ్సైట్ ద్వారా దేశంలోని పీఏసీఎస్‌లకు పోతుగల్ ఆదర్శంగా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. వినూత్న ప్రయత్నంతో ముందుకొచ్చిన పోతుగల్ సొసైటీ కార్యవర్గాన్ని ఆయన అభినందించారు.
ఇవీ చూడండి: ఇళ్లు కట్టుకునే పేదలకు టీఎస్‌బీపాస్ బ్రహ్మాస్త్రం: కేటీఆర్