ETV Bharat / state

'వన్ ర్యాంక్-వన్ పెన్షన్ నుంచి నో ర్యాంక్-నో పెన్షన్ స్థాయికి దిగజార్చారు..'

ktr on agnipath protest: కేంద్రం కళ్లు తెరిచి.. వివాదాస్పదంగా మారిన అగ్నిపథ్​ను పునఃసమీక్షించాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు డిమాండ్ చేశారు. దేశంలో జరుగుతున్న అల్లర్లకు కేంద్రానిదే బాధ్యత అన్నారు. అగ్నిపథ్​పై నిరుద్యోగుల అనుమానాలు, ఆవేదనను అర్థం చేసుకుంటామని కేటీఆర్ అన్నారు. కేంద్రం ఏకపక్షంగా, నియంతృత్వ ధోరణితో తీసుకుంటున్న నిర్ణయాలే ఇలాంటి దుష్పరిణామాలకు దారితీస్తున్నాయన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో యువకుడి మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్.. ఇందుకు కేంద్రమే బాధ్యత వహించాలన్నారు.

'వన్ ర్యాంక్-వన్ పెన్షన్ నుంచి నో ర్యాంక్-నో పెన్షన్ స్థాయికి దిగజార్చారు..'
'వన్ ర్యాంక్-వన్ పెన్షన్ నుంచి నో ర్యాంక్-నో పెన్షన్ స్థాయికి దిగజార్చారు..'
author img

By

Published : Jun 17, 2022, 7:59 PM IST

ktr on agnipath protest: కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి అగ్నిపథ్ పథకాన్ని పునఃసమీక్షించాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. జై జవాన్-జై కిసాన్ అని నినదించిన దేశంలో.. నల్ల చట్టాలతో రైతుల గోసపెట్టిన కేంద్రం.. ఇప్పుడు అగ్నిపథ్​తో జవాన్లను నిర్వేదంలోకి నెడుతోందన్నారు. ఆర్మీని వన్ ర్యాంక్ - వన్ పెన్షన్ నుంచి నో ర్యాంక్ - నో పెన్షన్ స్థాయికి దిగజార్చిందని కేటీఆర్ విమర్శించారు. దేశవ్యాప్తంగా యువత ఆగ్రహానికి, ఆందోళనలకు కేంద్రానిదే పూర్తి బాధ్యత అన్నారు. భారత్ ప్రజాస్వామ్య దేశమని మరచి.. ఏకపక్షంగా, నియంతృత్వంగా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్లే ప్రజలకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు.

  • రైతులను సంప్రదించకుండా నల్ల చట్టాలు, వ్యాపారులను సంప్రదించకుండా జీఎస్టీ, దేశపౌరుల బాధలను పరిగణలోకి తీసుకోకుండా డిమానిటైజేషన్, లాక్ డౌన్, మైనార్టీలతో చర్చించకుండా సిఎఎ వంటి నిర్ణయాలు తీసుకొని దేశాన్ని సంక్షోభంలోకి నెట్టిన కేంద్రంలోని నియంతృత్వ బీజేపీ ప్రభుత్వం…

    — TRS Party (@trspartyonline) June 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రైతులను సంప్రదించకుండా నల్ల చట్టాలు, వ్యాపారులను సంప్రదించకుండా జీఎస్టీ, దేశ పౌరుల బాధలను పరిగణలోకి తీసుకోకుండా నోట్ల రద్దు, లాక్​డౌన్, మైనార్టీలతో చర్చించకుండా సీఏఏ వంటి నిర్ణయాలు తీసుకొని దేశాన్ని సంక్షోభంలోకి నెట్టిన కేంద్రంలోని నియంతృత్వ భాజపా ప్రభుత్వం.. తాజాగా దేశ యువత ఆకాంక్షలకు భిన్నంగా అనాలోచితంగా అగ్నిపథ్ విధానాన్ని తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. ఆందోళన చేస్తున్న యువకులపైనే నెపాన్ని నెట్టే దుర్మార్గపు ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోందన్నారు. సికింద్రాబాద్ కాల్పుల ఘటనలో చనిపోయిన యువకుడి మృతికి కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. మృతి చెందిన యువకుడి కుటుంబానికి మంత్రి కేటీఆర్ సానుభూతిని ప్రకటించారు.

75 శాతం నిరుద్యోగులుగా మారతారు: అగ్నిపథ్ పథకంపై అనేక అనుమానాలు ఉన్నాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కేంద్ర ఆర్థిక విధానాలు, పరిపాలనా నిర్ణయాల వల్ల దేశంలో నిరుద్యోగం తీవ్రస్థాయిలో ఉన్న తరుణంలో ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని ఎదురుచూస్తున్న కోట్లాది మంది యువత ఆశలను వంచించే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దేశ భద్రతను కూడా కాంట్రాక్ట్ విధానానికి అప్పజెప్పడం.. దేశ భద్రతపై వారి డొల్లవిధానాలకు నిదర్శనమన్నారు.

అగ్నిపథ్ ద్వారా దేశ భద్రతతో పాటు దేశ యువత భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుందన్నారు. నాలుగేళ్లు ఆర్మీలో విధులు నిర్వహించిన యువతలో 75 శాతం తిరిగి నిరుద్యోగులుగా మారతారన్నారు. యుక్త వయసులో ఆర్మీలో చేరిన వారిని నాలుగేళ్లకే బయటకు పంపిస్తే.. తర్వాత ఉపాధి అవకాశాలు దక్కే అవకాశాలే లేవన్నారు. సంవత్సరాల పాటు ఆర్మీలో పని చేసి బయటకు వచ్చిన మాజీ సైనికులకే సరైన ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఇలాంటి సందర్భంలో సైన్యంలో చేరిన వారిలో 75 శాతం మందిని ఏటా నిరుద్యోగులుగా మార్చే ఈ విధానాన్ని వెంటనే పునఃసమీక్షించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తారా..?: నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చిన అగ్నివీరులకు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు దొరుకుతాయని కేంద్రం చెబుతున్న మాటలు శుద్ధ అబద్ధమన్నారు. ప్రైవేటురంగంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అన్న ప్రధాని మోదీ మాటలు.. ఎంత నిజమో దేశ యువతకి తెలుసని ఎద్దేవా చేశారు. ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండే గ్రామీణ ప్రాంత యువత ఆర్మీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుందని, అలాంటి గ్రామీణ యువత నాలుగేళ్ల తర్వాత పోటీ అధికంగా ఉండే ప్రైవేటు రంగంలో ఉపాధి పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయని కేటీఆర్ అన్నారు. సంక్షోభ సమయాల్లో దేశ రక్షణకు శిక్షణ కలిగిన నూతన సైనికులతో పాటు అనుభవజ్ఞులైన సిబ్బంది ఉండాల్సిన అవసరం చరిత్రలో అనేక సందర్భాల్లో రుజువైందన్నారు. అగ్నిపథ్​తో దశాబ్దాలుగా ఆర్మీలో ఉన్న సంస్థాగత సంస్కృతి, సంప్రదాయాలు, విలువలకు భంగం కలిగే ప్రమాదం ఉందన్నారు. భారత్​కు పొరుగు దేశాలతో అనేక సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందన్నారు.

ఆందోళనలు చూస్తేనే అర్థమవుతుంది: దేశ భద్రత కన్నా కేవలం ఆర్థిక పరమైన అంశాలకే భాజపా ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం ఆందోళనకరమన్నారు. పెన్షన్ డబ్బులను ఆదా చేసేందుకు కేంద్రం చేపట్టిన చౌకబారు ఎత్తుగడే ఈ వివాదాస్పద విధానమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే భాజపా తీసుకున్న అనేక నిర్ణయాలు దేశ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉన్నాయనే విషయం డీమానిటైజేషన్, నల్ల వ్యవసాయ చట్టాలు వంటి వాటి విషయంలో నిరూపితమైందన్నారు. ఇప్పుడు భాజపా చేపట్టిన అగ్నిపథ్ పథకం నిర్ణయంపై తీవ్రమైన ఆందోళనలు కొనసాగుతున్న తీరు, దేశంలో పేరుకుపోయిన నిరుద్యోగ సమస్య తీవ్రతకు నిదర్శనమన్నారు.

మోదీ మౌనం వీడాలి: ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరిచి దేశ యువకుల ఆవేదనను అర్థం చేసుకొని ఈ విధానాన్ని వెంటనే సమీక్షించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశంలో ఏ సంక్షోభం వచ్చినా మౌనాన్ని ఆశ్రయించే ప్రధాని నరేంద్ర మోదీ, ఈ కీలక విషయంలో ఎప్పటిలాగే దాటవేయకుండా, వెంటనే తమ వైఖరిని స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విధానంపై ఆందోళన చేస్తున్న దేశ యువత అనుమానాలను, ఆవేదనను తాము అర్థం చేసుకుంటామని, ఈ విధానంపైన సమీక్షకు వారి పక్షాన కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు.

ఇవీ చూడండి..

స్వస్థలానికి రాకేశ్ మృతదేహం.. గాయపడ్డ వారికిగాంధీలో కొనసాగుతున్న చికిత్స

పోలీసుల అదుపులో ఆందోళనకారులు.. సికింద్రాబాద్​లో సాధారణ పరిస్థితులు

ఏడు రాష్ట్రాల్లో 'అగ్నిపథ్' మంటలు.. అనేక చోట్ల విధ్వంసకాండ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.