ETV Bharat / state

కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతం

author img

By

Published : Jan 24, 2020, 7:48 PM IST

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ నాలుగు రోజుల దావోస్​ పర్యటన విజయవంతంగా ముగిసింది. కేటీఆర్ తన పర్యటనలో భాగంగా అనేక ప్రముఖ కంపెనీల సీనియర్ ప్రతినిధులతో పాటు వివిధ దేశాలకు చెందిన మంత్రులను కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించటమే గాక.. స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచేందుకు దోహదపడిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Minister
కేటీఆర్ దావోస్ పర్యటన సక్సెస్

వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోసం దావోస్​లో పర్యటించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​.. సుమారు 50కి పైగా ముఖాముఖి సమావేశాలకు హాజరయ్యారు. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన 5 చర్చ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత నాలుగు రోజులుగా మంత్రి ఆల్ఫాబెట్ మరియు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, కోకా కోలా సీఓవో జేమ్స్ క్వేన్సీ , సేల్స్ ఫోర్స్ స్థాపకుడు ఛైర్మన్ మార్క్ బెనియాఫ్, యూట్యూబ్ సీఈవో సుసాన్ వొజ్కికి లాంటి కార్పొరేట్ దిగ్గజాలతో సమావేశం అయ్యారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లో తెలంగాణ అగ్రస్థానం...

తెలంగాణ రాష్ట్ర ప్రగతిశీల విధానాలను, పారిశ్రామిక పాలసీని, స్థానికంగా ఉన్న పెట్టుబడి అవకాశాలను, వివిధ పరిశ్రమలకు ఇక్కడ అందుబాటులో ఉన్న వసతుల గురించి కేటీఆర్ వివరించారు. రాష్ట్రం ఏ విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్​లో అగ్రస్థానంలో నిలుస్తున్న అంశాన్ని కూడా ప్రస్తావించారు.

గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం శీఘ్ర గతిన అభివృద్ధి చెందుతున్న తీరుని మంత్రి వివరించారు. ఇక్కడి కాస్మోపాలిటన్ కల్చర్​ని మరియు గత కొన్ని సంవత్సరాలుగా జీవించేందుకు అనువుగా ఉన్న నగరాల్లో అత్యుత్తమ నగరంగా ఎంపిక అవుతున్న విషయాన్ని సదస్సుల్లో చెప్పుకొచ్చారు.

రూ.500 కోట్ల పెట్టుబడులు...

దావోస్ పర్యటన ద్వారా పిరమల్ గ్రూప్​కి సంబంధించిన ఐదు వందల కోట్ల పెట్టుబడితో పాటు అనేక ఇతర కంపెనీలు తెలంగాణ పట్ల ఆసక్తి వ్యక్తం చేసేలా మంత్రి ఈ పర్యటన ద్వారా విజయం సాధించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా దావోస్​ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పెవిలియన్ని ఏర్పాటు చేసింది.

సదస్సుకు మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలు కూడా పాల్గొన్నప్పటికీ మంత్రి కేటీఆర్​ బృందం తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకురాగలిగింది. మంత్రి ప్రతినిధి బృందంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తోపాటు డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొనతం, టీ హబ్ సీఈవో రవి నారాయణ్​ ఉన్నారు.

కేటీఆర్ దావోస్ పర్యటన సక్సెస్

ఇవీ చూడండి: మంత్రి గంగుల వ్యాఖ్యలను పరిశీలిస్తాం: నాగిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.