హైదరాబాద్ కూకట్పల్లిలో మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జేఎన్టీయూ ఉపకులపతి మంజుర్ హుస్సేన్ మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హుస్సేన్ అన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా జేఎన్టీయూలో కూకట్పల్లి శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావుతో కలిసి 5 వేల మొక్కలు నాటారు.
గ్రీన్ ఛాలెంజ్ విసరాలి...
నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు ఐదు వేల మొక్కలు నాటారు. దాతల సహకారంతో ప్రతి మొక్కకు రక్షణ ఏర్పాటు చేస్తామని జేఎన్టీయూ అధికారులు, కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత, డిప్యూటీ కమిషనర్ రవి కుమార్ తెలిపారు. మొక్క నాటిన ప్రతి వ్యక్తి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ విసరాలని ఎమ్మెల్యే మాధవరం పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి : 'పీవీ బాటలో నడుస్తాం... 2023లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం'