కొందరు శత్రువులు తనకు కూడా ఈటల రాజేందర్ గతి పడుతుందని కలలు కంటున్నారని... అది అసాధ్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. సొంత పార్టీలో తనకు శత్రువులెవరూ లేరని.. ఇతర పార్టీలే ప్రభుత్వాన్ని గందరగోళ పరచాలని ఇలాంటి పిచ్చి కలలు కంటున్నాయన్నారు.
ఈటల రాజేందర్‌ను ఇలాగే ఆగం చేశారని.. ఇప్పుడు మరొకరి కోసం చూస్తున్నారని వ్యాఖ్యానించారు. హంపిలో తన కుమారుడి పుట్టిన రోజు విందులో ఏదో జరిగినట్లు కట్టుకథ సృష్టించారని.. అదంతా అబద్ధమని ఖండించారు. అయితే... ఈటల మాదిరిగానే జగదీశ్‌రెడ్డికి తెరాస నుంచి ఉద్వాసన తప్పడంటూ ఎంపీ రేవంత్ రెడ్డి ఇటీవల ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: మంత్రి జగదీశ్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు