ETV Bharat / state

శ్రీశైలం ప్రమాదం గురించి అప్పుడే ఏం చెప్పలేం: మంత్రి జగదీశ్ రెడ్డి - మంత్రి జగదీశ్ రెడ్డి వార్తలు

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం ఘటన... గతంలో ఎప్పుడు ఎక్కడా జరగలేదని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రమాదంపై ఇప్పుడే ఏమి చెప్పలేమని... త్వరలోనే దానిపై పూర్తి నివేదిక ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

minister-jagadish-reddy-about-srisailam-fire-accident-in-legislative-council-of-telangana
శ్రీశైలం ప్రమాదం గురించి అప్పుడే ఏమి చెప్పలేం: మంత్రి జగదీశ్ రెడ్డి
author img

By

Published : Sep 15, 2020, 11:58 AM IST

శ్రీశైలం ప్రమాదంపై ఇప్పుడే ఏమి చెప్పలేమని... ప్రస్తుతం కేసు పురోగతిలో ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఘటనపై సీఐడీ విచారణతోపాటు అంతర్గత విచారణకు కూడా అయిదుగురు సభ్యులతో కమిటీ వేశామని వెల్లడించారు. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పాం... కానీ కమిటీలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. అందుకే ఆలస్యం జరిగింది.

''ప్రమాదం మీద మీకు ఏమి సందేహాలున్నాయో.. అవి అందరిలోనూ ఉన్నాయి. ప్రమాద సమయంలో నేను అక్కడే ఉన్నాను. చాలా ప్రయత్నం చేశాము... కానీ వారిని రక్షించడం సాధ్యం కాలేదు. ఇలాంటి ఘటన గతంలో ఎక్కడ జరగలేదు. ప్రమాదాలు జరిగి... రియాక్టర్లు పేలి, అగ్నికి ఆహుతై ప్రాణాలు విడిచిన వారిన చూశాం కానీ... ఇలా పొగ కారణంగా ప్రాణాలు వదిలిన ఘటన ఇదే తొలిసారి.''

-మంత్రి జగదీశ్ రెడ్డి

శ్రీశైలం ప్రమాదం గురించి అప్పుడే ఏమి చెప్పలేం: మంత్రి జగదీశ్ రెడ్డి

చాలా వీరోచితంగా పోరాడి... ఉద్యోగులు అమరులయ్యారని మంత్రి పేర్కొన్నారు. వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన తెలిపారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. జరిగిన కారణాలు తెలుసుకుని... భవిష్యత్తులో పునరావృతం కాకుండా... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై నివేదిక ఇవ్వనున్నామని మంత్రి తెలిపారు.

ఇదీ చూడండి: శ్రీశైలంలో ప్రత్యేక బలగాలు ఎంతగా శ్రమించాయో తెలుసా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.