ETV Bharat / state

'జూన్​ చివరినాటికి ఎస్సారెస్పీ పనులన్నీ పూర్తి చేస్తాం' - minister review on srsp channel works

జూన్ నెల చివరికి ఎస్సారెస్పీ పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సారెస్పీ కాల్వలకు చేయాల్సిన మరమ్మతులపై నీటిపారుదల శాఖ ఈఎన్సీ, ఇంజినీర్లతో హైదరాబాద్​లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

minister jagadeshreddy review
నీటిపారుదలశాఖ అధికారులతో మంత్రి సమీక్ష
author img

By

Published : Mar 2, 2020, 8:19 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు సూర్యాపేట జిల్లా చివరి ఆయకట్టు వరకు చేరుకున్నాయని మంత్రి జగదీశ్​ రెడ్డి అన్నారు. ఎస్సారెస్పీ కాల్వలకు చేయాల్సిన మరమ్మతులపై నీటిపారుదల శాఖ ఈఎన్సీ, ఇంజినీర్లతో హైదరాబాద్​లో సమీక్షించారు. కాలువల సర్వే సందర్భంగా గుర్తించిన సమస్యలన్నీ జూన్​ చివరినాటికి పరిష్కరించుకోవాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలపై అధికారులతో సమీక్షించినట్లు వెల్లడించారు.

ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడమే తమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఎస్​ఎల్​బీసీ సొరంగ మార్గ పనులు కూడా పూర్తి చేసేలా గుత్తేదారుకు ప్రభుత్వ పరంగా సహకరిస్తున్నామని... పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై త్వరలోనే ముఖ్యమంత్రి త్వరలోనే సమీక్షిస్తారని వెల్లడించారు.

విద్యుత్​ డిమాండ్​ తగ్గట్లు ఏర్పాట్లు

విద్యుత్ డిమాండ్ ఊహించిందేనని...ఎత్తిపోతల వల్ల వచ్చే అదనపు డిమాండ్​కు సిద్ధంగా ఉండాలని సీఎం ముందే చెప్పారన్నారు. ఎంత విద్యుత్ డిమాండ్ ఉన్నా ఇబ్బంది లేదని...అవసరమైన మేర విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

'జూన్​ చివరినాటికి ఎస్సారెస్పీ పనులన్నీ పూర్తి చేస్తాం'

ఇదీ చూడండి: రబీసాగు అంచనాకు ఏర్పాట్లు చేయండి: సబ్ కమిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.